
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులు, యూవీ క్రియేషన్స్ అధినేతలు నిర్మించి భారీ మల్టీప్టెక్స్ వీ సెల్యులాయిడ్. ఈ మల్టీప్లెక్స్ రేపు సాహో సినిమాతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చెర్రీ ‘ఆసియా లోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. చిరంజీవి నటించిన సైరా సినిమాను కూడా ఇక్కడ ప్రదర్శించేలా చూస్తాం చిరంజీవిని కూడా ఇక్కడకు తీసుకువస్తా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్‌తో పాటు మల్టీప్లెక్స్ నిర్వహకులు, సాహో చిత్ర దర్శకుడు సుజీత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment