ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..! | Jagapathi Babu in Talks For Prabhas Next Movie | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

Published Wed, Sep 25 2019 10:23 AM | Last Updated on Wed, Sep 25 2019 10:23 AM

Jagapathi Babu in Talks For Prabhas Next Movie - Sakshi

సాహో సినిమాతో మరోసారి సత్తా చాటిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, నెక్ట్స్ ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 20 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు ‘జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 1950ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగపతి బాబు విలన్‌ పాత్రలో నటించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు పాత్రలో చాలా విభిన్నంగా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement