
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో ఆగస్లు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్, సాంగ్ టీజర్‌లతో అలరించిన చిత్రయూనిట్ తాజాగా రెండో పాటకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
తొలి పాటగా ఓ పెప్పీ నంబర్‌ను రిలీజ్ చేసిన యూనిట్, తాజాగా ఏ చోట నువ్వున్నా అంటే సాగే రొమాంటిక్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రభాస్ డార్లింగ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటకు గురు రణ్‌ధవ సంగీతమందించగా కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్‌లు ఆలపించారు.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.