
దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ‘సాహో’ ప్రయాణం ముగిసినట్లు తెలిసింది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లు తెలిసింది. ఈ విషయం నిజం అని చెప్పేలా ప్యాకప్ పార్టీలో పాల్గొన్న ప్రభాస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సాహో’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆగస్టు 15న విడుదల కావడం లేదని, ఆగస్టు 30న విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్స్ భారీగా ఉండటంవల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్లే ‘సాహో’ విడుదల వాయిదా పడిందని టాక్. ఈ విషయంపై యూనిట్ నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.