డివైడ్ టాక్‌తో మొదలైనా.. సాహో తన సత్తా చూపిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో పాటు, ఇండియాస్ బిగెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అన్న ప్రచారం జరగటంతో సాహోపై భారీఅంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు ఈ సినిమా సత్తా చాటింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్ సినిమాయే ఉండటం విశేషం. బాహుబలి 2తో తొలి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది సాహో. మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లో సాహో మంచి వసూళ్లు సాధిస్తున్నా.. ఓవర్ సీస్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేవు.
Comments
Please login to add a commentAdd a comment