‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..? | Prabhas Saaho Is Censored With UA | Sakshi
Sakshi News home page

‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..?

Published Fri, Aug 23 2019 6:23 PM | Last Updated on Fri, Aug 23 2019 6:23 PM

Prabhas Saaho Is Censored With UA - Sakshi

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరగడం.. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ యాక‌్షన్‌ చిత్రంగా అత్యంత భారీఎత్తున​ సాహోను నిర్మించడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. పాటలతో, టీజర్‌, ట్రైలర్‌తో భారీ హైప్‌ క్రియేట్‌చేసిన సాహో.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
 
ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 171.52 నిమిషాలు (2 గంటల 51 నిమిషాలు). ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 30న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement