సాహో రిజల్ట్‌పై కేఆర్‌కే అంచనాలివే.. | Krk Takes U Turn Over Saho Mania | Sakshi
Sakshi News home page

సాహో మేనియాతో కేఆర్‌కే యూటర్న్‌

Published Fri, Jun 21 2019 7:03 PM | Last Updated on Wed, Jul 17 2019 9:52 AM

Krk Takes U Turn Over Saho Mania - Sakshi

ముంబై : బాహుబలి గ్రాండ్‌ సక్సెస్‌ తర్వాత ప్రభాస్‌ తదుపరి ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సాహోపై అంచనాలు మిన్నంటిన క్రమంలో ఇటీవల విడుదలైన టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్‌ రాబట్టింది. టీజర్‌తోనే సాహో విన్యాసాలు ఏ రేంజ్‌లో ఉంటాయో వెల్లడవడంతో మూవీ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంటుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఇక సాహోపై సినీ విమర్శకుడు, నటుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌ (కేఆర్‌కే) చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

కాగా సినిమాపై రూ 250 కోట్ల భారీ బడ్జెట్‌ వెచ్చించడంతో సాహో అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుందని టీసిరీస్‌ భారీ డిజాస్టర్లలో ఒకటిగా నిలుస్తుందని గతంలో ట్వీట్‌ చేసిన కేఆర్‌కే తాజాగా యూటర్న్‌ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘సాహో పెద్ద హిట్‌గా నిలుస్తుంది..బాలీవుడ్‌లోనూ పెద్ద స్టార్‌లలో ఒకడిగా ప్రభాస్‌ ముందుకొస్తారు..దక్షిణాదిలోనూ పాపులారిటీ కలిగిన మరో సూపర్‌స్టార్‌ బాలీవుడ్‌కు రావడం గొప్ప విషయ’మని కేఆర్‌కే మాటమార్చారు. టీజర్‌తో​రేగిన సాహో మానియాతోనే కేఆర్‌కే యూటర్న్‌ తీసుకున్నాడని చెబుతున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సాహోలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ నటిస్తున్న ఈ మూవీ ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement