‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు | Saaho Bad Boy Song Most Viewed Video Worldwide | Sakshi
Sakshi News home page

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

Published Tue, Aug 20 2019 7:14 PM | Last Updated on Tue, Aug 20 2019 7:18 PM

Saaho Bad Boy Song Most Viewed Video Worldwide - Sakshi

అభిమానులు ఓ సినిమాపై అంచనాలు పెట్టుకుంటే ఏ రేంజ్‌లో ఆదరిస్తారో చరిత్రలో అనేక సార్లు చూశాం. ఆ సినిమాకు సంబంధించిన ఫోటో, టీజర్‌, ట్రైలర్‌, మేకింగ్‌ వీడియో, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లను ఎంతో హైలెట్‌ చేస్తారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘సాహో’పై కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు రికార్డులు క్రియేట్‌ చేసాయి. తాజాగా సాహో సినిమాలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో ప్రభాస్‌ బ్యాడ్‌ బ్యాయ్‌ అంటూ ఓ ప్రత్యేక గీతానికి స్టెప్పులేసిన వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను 85,24,114 మంది వీక్షించారు. అంతేకాకుండా 3,58,664 మంది లైక్‌ కొట్టారు. దీంతో ప్రపంచంలోనే కేవలం 24 గంటల్లో ఇన్ని లక్షల మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్‌ బాయ్‌’నిలిచింది. ఇక ఆగస్టు 30న విడుదల కానున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.   

చదవండి:
‘సాహో నుంచి తీసేశారనుకున్నా’
ప్రభాస్‌ సింగిలా.. డబులా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement