
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో సినిమా విడుదల వాయిదా పడింది.
సాక్షి, హైదరాబాద్: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమా విడుదల వాయిదా పడింది. ఆగస్టు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని యూవీ క్రియేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో సినిమా విడుదల వాయిదా వేసినట్టు వెల్లడించింది. పోరాట దృశ్యాలకు మరింత సమయం అవసరం కావడంతో విడుదల తేదీని ఈనెల 15 నుంచి 30కు మార్చినట్టు తెలిపింది. భారీ యాక్షన్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ అందించేందుకు పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నట్టు వివరించింది.
సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, ప్రకాశ్ బేలవాది, ఎల్విన్ శర్మ, మహేష్ మంజ్రేకర్, టినూ ఆనంద్, లాల్, శరత్ లోహితశ్వా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘సాహో’ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment