ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..! | Saaho Effects on Kollywood | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

Published Sun, Jun 16 2019 3:14 PM | Last Updated on Wed, Jul 17 2019 9:52 AM

Saaho Effects on Kollywood - Sakshi

సాక్షి, చెన్నై: ‘బాహుబలి’తో చరిత్ర సృష్టించిన టాలీవుడ్‌ హీరో, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్‌ డిజిటల్‌వ్యూస్‌లో రికార్డు సృష్టించింది. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రభావం కోలీవుడ్‌హీరోలైన అజిత్‌, సూర్య సినిమాలపై పడింది. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ను తమిళంలో అజిత్‌ హీరోగా‘నెర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.దివంగత నటి,శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 10న రిలీజ్‌ చేద్దామని భావించారట. కానీ రెండు సినిమాల మధ్య 5 రోజులే గ్యాప్‌ ఉండడంతో కలెక్షన్లపై ప్రభావంపడుతుందని తమ సినిమాను జులై నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సిద్ధపడిందని సమాచారం. అలాగే సూర్య నటించిన కాప్పన్‌ కూడా ఈ వరుసలోఉన్నట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement