Ajith Movie
-
అజిత్‌తో రెండోసారి సెట్ అయినట్లేనా?
ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమ దృష్టి అంతా నటుడు అజిత్ నటించే 62వ చిత్రంపైనే. దీనికి కారణం ప్రారంభానికి ముందే దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను చిత్రం నుంచి తొలగించడం, ఆ స్థానంలో మగిళ్ తిరుమేణిని ఎంపిక చేయటం. దీనికితోడు చిత్ర షూటింగ్‌ను 3 నెలల్లోనే పూర్తి చేయాలని అజిత్ దర్శకుడికి ఆంక్షలు విధించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. అదేవిధంగా లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతమైనట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ నటించే అవకాశం ఉందని తొలుత ప్రచారం సాగింది. తర్వాత నయనతార, త్రిష పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని నటి కాజల్ అగర్వాల్ దక్కించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తుతున్నాయి. చదవండి: పెళ్లి తర్వాత నయన్‌కు కలిసిరావడం లేదా? ఈమె ఇంతకుముందు అజిత్ సరసన వివేకం చిత్రంలో నటించారు. శివ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా, కరోనా టైమ్‌లో నటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమలహాసన్ సరసన ఇండియన్ 2, కరుంగాపియన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ 62వ చిత్రంలో కాజల్ నటించే విషయమై అధికారిక ప్రకటన త్వరలో వెలువనుందని తెలుస్తోంది. -
బ్యాంక్‌కు వచ్చి బీర్, బ్రాందీ అడుగుతారా?.. అదిరిపోయిన ట్రైలర్
తమిళ స్టార్ నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'తునివు'. తెలుగులో ఈ చిత్రాన్ని తెగింపు పేరుతో విడుదల చేస్తున్నారు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం తునివు షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైంది. 'ప్రజల డబ్బు దోచుకుంటున్నావే.. సిగ్గుగా లేదు' అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ చూస్తే ఈ మూవీ మొత్తం బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. సముద్రంలో ఫైట్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మంజు వారియర్ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్‌కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. -
అతనే నంబర్‌వన్ హీరో.. దిల్ రాజు కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కోలీవుడ్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అగ్రహీరో విజయ్ హీరోగా 'వారిసు'(తెలుగులో వారసుడు)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు అజిత్ సినిమా తునివు విడుదల కానుంది. దీంతో రెండు చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈ సమస్యపై స్పందిస్తూ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఇంతకీ దిల్ రాజు అన్న మాటలేంటీ? ఫ్యాన్స్ ఎందుకు ఆయనను ట్రోల్స్ చేస్తున్నారో చూద్దాం. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. 'విజయ్ తమిళనాడులో నంబర్‌వన్ హీరో. అజిత్ కంటే పెద్ద స్టార్. కానీ వారిసు, తునివు ఓకే రోజు విడుదలవుతున్నాయి. అందువల్ల తమిళనాడులోని 800 థియేటర్లలో 50:50 ఇస్తామని చెప్పారు. కానీ విజయ్ నంబర్‌వన్ హీరో కావున ఓ 50 థియేటర్లు అదనంగా కావాలని కోరుతున్నా. దీనిపై చెన్నైకి వెళ్లి సీఎం స్టాలిన్ కలిసి విజ్ఞప్తి చేయబోతున్నా.' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరలైంది. (ఇది చదవండి: 'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి) కోలీవుడ్‌లో విజయ్ నంబర్‌వన్ హీరో అనడంపై అజిత్ అభిమానులు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అభిమానుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారిసు చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. తెలుగు, తమిళంలో ఓకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు భారీ అంచనాల మధ్య అజిత్ 'తునివు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను అజిత్, దర్శకుడు హెచ్.వినోత్, నిర్మాత బోనీ కపూర్ కాంబినేషన్లో వరుసగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అజిత్ తొలిసారిగా విఘ్నేష్ శివన్‌తో జతకట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
ఆ స్టార్ హీరోకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ?
Rakul Preet Singh Sign To Kollywood Movie With Ajith: రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీతో ప్రార్థనగా టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ కూల్ బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు గడించింది. యూత్‌లో రకుల్‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. కానీ 2017 నుంచి బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది ఈ ఫిట్నెస్ భామ. ప్రస్తుతం రకుల్ ఏకంగా 5 హిందీ సినిమాల్లో నటిస్తోంది. అమితాబ్, అజయ్ దేవగణ్ మల్టీస్టారర్ చిత్రం 'రన్ వే 34' ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా మల్టీస్టారర్ థ్యాంక్ గాడ్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి లాంటి చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ భామ ఓ తమిళ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో అజిత్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయి, కథ నచ్చడంతో రకుల్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ మూవీని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. చదవండి: విభిన్న పాత్రల్లో కూల్ బ్యూటీ.. 2022లో 7 సినిమాలు చదవండి: రన్‌వే 34గా మారిన మేడే.. 3 ఫస్ట్ లుక్‌లు విడుదల -
ప్రభాస్ ఎఫెక్ట్‌తో అజిత్ ముందుకు..!
సాక్షి, చెన్నై: ‘బాహుబలి’తో చరిత్ర సృష్టించిన టాలీవుడ్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ డిజిటల్వ్యూస్లో రికార్డు సృష్టించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రభావం కోలీవుడ్హీరోలైన అజిత్, సూర్య సినిమాలపై పడింది. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ను తమిళంలో అజిత్ హీరోగా‘నెర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.దివంగత నటి,శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 10న రిలీజ్ చేద్దామని భావించారట. కానీ రెండు సినిమాల మధ్య 5 రోజులే గ్యాప్ ఉండడంతో కలెక్షన్లపై ప్రభావంపడుతుందని తమ సినిమాను జులై నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధపడిందని సమాచారం. అలాగే సూర్య నటించిన కాప్పన్ కూడా ఈ వరుసలోఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. -
'ఆరంభం'తో కోలీవుడ్‌కు రానా
మరో టాలీవుడ్ హీరో తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కొంతమంది తెలుగు యువ హీరోలు కోలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే.... తాజాగా యువ హీరో రానా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్లో సత్తా చాటిన రానా .... అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆరంభం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ సత్యసాయి మూవీస్ పతాకంపై రఘురాం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్, నయనతారా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో జంటగా ఆర్య, తాప్సీ నటిస్తుండగా.... దగ్గుబాటి రానా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. యువన్ శంకర్ రాజా సంగీత బాణాలు సమకూర్చిన 'ఆరంభం' ఆడియో ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.