Rakul Preet Singh Sign To Kollywood Movie With Ajith: రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీతో ప్రార్థనగా టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ కూల్ బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు గడించింది. యూత్‌లో రకుల్‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. కానీ 2017 నుంచి బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది ఈ ఫిట్‌నెస్ భామ. ప్రస్తుతం రకుల్ ఏకంగా 5 హిందీ సినిమాల్లో నటిస్తోంది. అమితాబ్, అజయ్ దేవగణ్ మల్టీస్టారర్ చిత్రం 'రన్ వే 34' ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా మల్టీస్టారర్ థ్యాంక్ గాడ్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి లాంటి చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ భామ ఓ తమిళ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో అజిత్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయి, కథ నచ్చడంతో రకుల్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ మూవీని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
చదవండి: విభిన్న పాత్రల్లో కూల్ బ్యూటీ.. 2022లో 7 సినిమాలు
చదవండి: రన్‌వే 34గా మారిన మేడే.. 3 ఫస్ట్ లుక్‌లు విడుదల
Rakul Preet Singh: ఆ స్టార్ హీరోకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ?
Published Fri, Apr 15 2022 2:59 PM | Last Updated on Fri, Apr 15 2022 3:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment