తమిళ నటుడు అజిత్‌ను తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తారు. సినిమాలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. అంతే స్థాయిలో ట్రావెలింగ్‌ను కూడా ఇష్టపడుతారు. అజిత్‌కు ఏమాత్రం విరామం దొరికినా బైక్, కార్ సాయంతో టూర్స్ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తన ట్రావెలింగ్ విశేషాలు తెలుపుతూ ఓ వీడియో పంచుకున్నారు. సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న అందులో పలు ఆసక్తికరమైన విషయాలను అజిత్ పంచుకున్నారు. ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.
ప్రపంచానికి ట్రావెలింగ్‌ను ప్రమోట్‌ను చేయడం చాలా ఇష్టమని అజిత్ తెలిపారు. జీవితంలో ఇలా ప్రయాణించడం వల్ల ఉత్తమ విద్యను అందిస్తుదని నేను నమ్ముతున్నాను. ఇంత కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇంకోకటి లేదనేది నా అభిప్రాయం. మతం, కులం అనేవి రెండూ కూడా మనం జీవితంలో ఎప్పుడు కలవనివారిని కూడా ద్వేషించేలా చేస్తాయని ఒక సూక్తి ఉంది. అది నిజం అని నేను నమ్ముతాను. ఎందుకంటే..? ఎదుటి వారితో మనకు పరిచయం లేనప్పటికీ వారు ఎలాంటివారో డిసైడ్ చేసేస్తాం.
మనం ట్రావెల్ చేస్తున్న క్రమంలో వివిధ మతాలకు చెందిన వారిని కలుస్తూ ఉంటాం. వారితో మాట్లాడినప్పుడు వాళ్లు ఏంటో మనకు తెలుస్తుంది. మన ఆలోచన ఎంత తప్పో అర్థం అవుతుంది. వివిధ మతాల వారిని కలిసినప్పుడు వారి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటాం. దీంతో ఇతరులపై సానుభూతి ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతారు. అందుకే ట్రావెలింగ్ చేసి మనకు తెలియని వ్యక్తులను కలవండి.' అంటూ అజిత్ పేర్కొన్నారు.
ప్రస్తుతం అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. లైకా ప్రోడక్షన్స్‌పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. 'మార్క్ ఆంటోని' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ మూవీకి డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.
Fueling passion for adventure! 🏍️ #AjithKumar on a thrilling journey with #VenusMotortours. Experience the best of Indian bike tours, where every ride is a story of freedom and speed! 🇮🇳✨@VenusMotoTours @Donechannel1 @Dubai_Autodrome#BikeTours pic.twitter.com/YwqKK7BiNF
— Suresh Chandra (@SureshChandraa) October 5, 2024
Comments
Please login to add a commentAdd a comment