bonykapoor
-
బోరున విలపించిన బోనీ కపూర్.. ఆమెకు మాత్రమే సాధ్యమంటూ..!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన భార్య దివంగత శ్రీదేవి మనకు సుపరిచితమే. తాజాగా ఆయన భార్య శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. భార్యను తలుచుకుంటూ బోరున విలపించారు. ఆమెను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు ఆయన చిన్నకుమార్తె ఖుషీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోనీ కపూర్ బోరున విలపించడంతో అక్కడే ఉన్న చిత్రనిర్మాత బాల్కీ ఆయనను ఓదార్చారు. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. (చదవండి: విధి మా కలలను నాశనం చేసింది.. బోనీ కపూర్ ఎమోషనల్) ఇటీవలే బోనీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ చేశారు. శ్రీదేవి 15 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించి తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా అద్భుత ప్రదర్శన చేయడం శ్రీదేవి మాత్రమే సాధ్యమైందంటూ కొనియాడారు. ఈ సినిమా ఆమె కెరీర్లో ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. గతంలో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్ చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. ఆమె నటన, అందాన్ని సినీలోకంతో పాటు యావత్ ప్రపంచం గుర్తు చేసుకుంది. ఆమె పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ప్రభాస్ ఎఫెక్ట్‌తో అజిత్ ముందుకు..!
సాక్షి, చెన్నై: ‘బాహుబలి’తో చరిత్ర సృష్టించిన టాలీవుడ్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ డిజిటల్వ్యూస్లో రికార్డు సృష్టించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రభావం కోలీవుడ్హీరోలైన అజిత్, సూర్య సినిమాలపై పడింది. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ను తమిళంలో అజిత్ హీరోగా‘నెర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.దివంగత నటి,శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 10న రిలీజ్ చేద్దామని భావించారట. కానీ రెండు సినిమాల మధ్య 5 రోజులే గ్యాప్ ఉండడంతో కలెక్షన్లపై ప్రభావంపడుతుందని తమ సినిమాను జులై నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధపడిందని సమాచారం. అలాగే సూర్య నటించిన కాప్పన్ కూడా ఈ వరుసలోఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. -
ముంబైలో ఉంటా.. సింగపూర్‌లోనూ కనిపిస్తా!
అది సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్. అక్కడ శ్రీదేవి ఉన్నారు. సంవత్సరం పొడవునా అక్కడే ఉంటారు. ఆ మాటకొస్తే ఏళ్ల తరబడి అక్కడే ఉంటారు. శ్రీదేవి ఏంటి? రెస్టారెంట్లో ఉండటమేంటి? ముంబై నుంచి సింగపూర్‌కి మకాం మార్చేశారా? ఒకవేళ మార్చినా రెస్టారెంట్లో ఉండటం ఏంటి? అనుకుంటున్నారా! ఆ రెస్టారెంట్లో శ్రీదేవి కనిపించే మాట నిజమే. అయితే ‘బొమ్మ’ రూపంలో. అదండీ అసలు మేటర్. ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవికి అభిమాలున్న విషయం తెలిసిందే. సింగపూర్ రెస్టారెంట్‌కి సంబంధించిన వాళ్లల్లో శ్రీదేవి అభిమాని ఉన్నారు. అంతే... అచ్చంగా ఆమెలా ఓ బొమ్మ తయారు చేయించి, రెస్టారెంట్లో పెట్టారు. ‘‘ఇండియాలోనూ, విదేశాల్లోనూ శ్రీదేవి పేరు మీద బోలెడన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఆమెకు ఎంత స్టార్డమ్ ఉందో తెలియజేయడానికి ఇదో ఎగ్జాంపుల్’’ అని శ్రీదేవి భర్త బోనీ కపూర్ అన్నారు. ‘‘నాకు మాటలు రావడం లేదు. నా పేరును ఎంతో స్వీట్‌గా ఇలా వాడుకుంటున్నారు. యాభై ఏళ్లుగా అభిమానుల ఆలోచనల్లో నేను ఉంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఐ యామ్ బ్లెస్డ్’’ అన్నారు శ్రీదేవి. ఏది ఏమైనా... శ్రీదేవి అంటే పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అన్నమాట. -
శ్రీదేవి కేవలం బోనీ భార్యే
ముంబై: అలనాటి అందాల తార శ్రీదేవి కపూర్ల కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలతో శ్రీదేవి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లియిన చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వగా.. ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కూడా సినీ అరంగేట్రం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నా బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు, యువ హీరో అర్జున్ కపూర్‌కు మాత్రం సవతి తల్లి అయిన శ్రీదేవి అంటే పడదు. శ్రీదేవి ఎప్పటికీ మా నాన్న భార్యే, అంతకుమించి మా మధ్య బంధం లేదంటూ అర్జున్ మరోసారి చెప్పాడు. శ్రీదేవితో తన అనుబంధం ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశాడు. అయితే ఎవరినీ అగౌరవంగా చూడవద్దని తన తల్లి మోనా కపూర్ చెప్పారని, శ్రీదేవిని కూడా అమర్యాదగా చూడనని అర్జున్ చెప్పుకొచ్చాడు. శ్రీదేవి కుటుంబంతో కలసి ఎప్పటికీ సంతోషంగా గడపలేనని అన్నాడు. కాగా అర్జున్ గురించి శ్రీదేవి ఎప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. వీరిద్దరూ కలసి ఇంతవరకు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.