Sridevi Husband Boney Kapoor Gets Emotional At English Vinglish Movie Event - Sakshi
Sakshi News home page

Bony Kapoor Emotional: అలా నటించడం ఆమెకు మాత్రమే సాధ్యం.. బోనీ కపూర్ ఎమోషనల్

Published Tue, Oct 11 2022 5:58 PM | Last Updated on Tue, Oct 11 2022 6:45 PM

Sridevi Husband Bony kapoor Emotional On English Vinglish Movie Event - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన భార్య దివంగత శ్రీదేవి మనకు సుపరిచితమే. తాజాగా ఆయన భార్య శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. భార్యను తలుచుకుంటూ బోరున విలపించారు. ఆమెను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు ఆయన చిన్నకుమార్తె ఖుషీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోనీ కపూర్ బోరున విలపించడంతో అక్కడే ఉన్న చిత్రనిర్మాత బాల్కీ ఆయనను ఓదార్చారు.  గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది.

(చదవండి: విధి మా కలలను నాశనం చేసింది.. బోనీ కపూర్‌ ఎమోషనల్‌)

ఇటీవలే బోనీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ చేశారు.  శ్రీదేవి 15 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఇంగ్లీష్ వింగ్లీష్‌ సినిమాలో నటించి తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు.  ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా అద్భుత ప్రదర్శన చేయడం శ్రీదేవి మాత్రమే సాధ్యమైందంటూ కొనియాడారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. గతంలో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్​ తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్​ చేసింది.  

అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. ఆమె నటన, అందాన్ని సినీలోకంతో పాటు యావత్ ప్రపంచం గుర్తు చేసుకుంది. ఆమె పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో  శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement