శ్రీదేవి కేవలం బోనీ భార్యే | Sridevi will always remain my dad's wife: Arjun Kapoor | Sakshi
Sakshi News home page

శ్రీదేవి కేవలం బోనీ భార్యే

Aug 4 2014 2:56 PM | Updated on Apr 3 2019 6:23 PM

శ్రీదేవి కేవలం బోనీ భార్యే - Sakshi

శ్రీదేవి కేవలం బోనీ భార్యే

శ్రీదేవి ఎప్పటికీ మా నాన్న భార్యే, అంతకుమించి మా మధ్య బంధం లేదంటూ అర్జున్ మరోసారి చెప్పాడు.

ముంబై: అలనాటి అందాల తార శ్రీదేవి కపూర్ల కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలతో శ్రీదేవి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లియిన చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వగా.. ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కూడా సినీ అరంగేట్రం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు, యువ హీరో అర్జున్ కపూర్కు మాత్రం సవతి తల్లి అయిన శ్రీదేవి అంటే పడదు. శ్రీదేవి ఎప్పటికీ మా నాన్న భార్యే, అంతకుమించి మా మధ్య బంధం లేదంటూ అర్జున్ మరోసారి చెప్పాడు. శ్రీదేవితో తన అనుబంధం ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశాడు. అయితే ఎవరినీ అగౌరవంగా చూడవద్దని తన తల్లి మోనా కపూర్ చెప్పారని, శ్రీదేవిని కూడా అమర్యాదగా చూడనని అర్జున్ చెప్పుకొచ్చాడు. శ్రీదేవి కుటుంబంతో కలసి ఎప్పటికీ సంతోషంగా గడపలేనని అన్నాడు. కాగా అర్జున్ గురించి శ్రీదేవి ఎప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. వీరిద్దరూ కలసి ఇంతవరకు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement