,శ్రద్ధా కపూర్, ప్రభాస్
ఆస్ట్రియాలోని 1368 అడుగుల ఎల్తైన ప్రదేశంలో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చిందేశారు. వీరి ఆటాపాటా ‘సాహో’ సినిమా కోసమే. ప్రభాస్, శ్రద్ధ జంటగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఆస్ట్రియాలోని అద్భుతమైన, అందమైన లొకేషన్స్‌లో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ నేతృత్వంలో చిత్రీకరించారు.
1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని సాంగ్ మేకింగ్ చేశారు చిత్రబృందం. అంత ఎత్తులో షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ కంగారుపడకుండా ప్రభాస్ అందర్నీ ప్రోత్సహించారట. ‘‘మాకు ఇంతలా సపోర్ట్ చేసిన చిత్రబృందానికి థ్యాంక్స్. ఈ చిత్రానికి జిబ్రాన్ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందిస్తున్నారు జిబ్రాన్. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న ‘సాహో’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మది.
Comments
Please login to add a commentAdd a comment