Sraddha Kapur
-
డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, శ్రద్ధా ఫోన్లు సీజ్
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దాకపూర్‌లను విచారించిన అధికారులు మరో కీలక ముందడగు వేశారు. శుక్ర,శనివారాల్లో వీరి విచారణ ముగిసిన అనంతరం నలుగురు నటీమణులు ఫోన్లను సీజ్‌చేశారు. నలుగురు హీరోయిన్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్, జయ షాల ఫోన్ల్‌ను సీజ్ చేసినట్లు ఎన్సీబీ ఆదివారం ఉదయం వెల్లడించింది. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు రకుల్‌పై ప్రశ్నల వర్షం కురిపింది. ఇక ఇదే కేసులో శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. (ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ) మరోవైపు కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఆధారం చాటింగ్ చేసినట్లు 7 గంటల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని ఆధారాల కోసం వారి మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ముగిసిన విచారణలో రకుల్‌పై ఎన్సీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆమె నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. రియాకు రకుల్‌కు మధ్య డ్రగ్స్ గురించి వాట్సప్‌లో చాటింగ్ జరిగినట్లు, తన నివాసంలో లభ్యమైన డ్రగ్స్ కూడా రియాకు చెందినట్లు రకుల్ వెల్లడించింది. తాజాగా వీరి మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడంతో విచారణ ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. -
1368 అడుగుల ఎత్తులో ఆటాపాటా
ఆస్ట్రియాలోని 1368 అడుగుల ఎల్తైన ప్రదేశంలో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చిందేశారు. వీరి ఆటాపాటా ‘సాహో’ సినిమా కోసమే. ప్రభాస్, శ్రద్ధ జంటగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఆస్ట్రియాలోని అద్భుతమైన, అందమైన లొకేషన్స్‌లో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ నేతృత్వంలో చిత్రీకరించారు. 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని సాంగ్ మేకింగ్ చేశారు చిత్రబృందం. అంత ఎత్తులో షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ కంగారుపడకుండా ప్రభాస్ అందర్నీ ప్రోత్సహించారట. ‘‘మాకు ఇంతలా సపోర్ట్ చేసిన చిత్రబృందానికి థ్యాంక్స్. ఈ చిత్రానికి జిబ్రాన్ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందిస్తున్నారు జిబ్రాన్. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న ‘సాహో’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మది. -
ఆస్ట్రియాలో ఆటాపాటా
హీరోయిన్ శ్రద్ధాకపూర్‌తో కలిసి ఫారిన్లో ప్రేమరాగం తీస్తున్నారు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో ప్రభాస్ పోలీస్ ఇన్ఫార్మర్గా నటిస్తున్నారని సమాచారం. శ్రద్ధాకపూర్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసిన టీమ్ ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధాలపై ఆస్ట్రియాలో ఓ పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాటతో ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయినట్లే. ఈ సినిమాకు జిబ్రాన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్‌విజయ్, ‘వెన్నల’ కిశోర్ తదితరులు నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మధి. -
ఆ కబురు చెబుతారా?
ఈ ఏడాది తన పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్ ఏదో చెబుతానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు ప్రభాస్. అంతే.. ఆ సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్ ఏంటా? అని ఆలోచించే పనిలో పడ్డారు ఫ్యాన్స్. ‘సాహో’ సెకండ్ టీజర్ రిలీజ్ అవుతుందని కొందరు, లేదు.. లేదు.. కె. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని ఇంకొందరు ఊహిస్తున్నారు. అయితే ప్రభాస్ కెరీర్‌ని పరిశీలిస్తే మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటి వాటిని అవి రిలీజైన తర్వాత మాత్రమే ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ముందు చెప్పడం చాలా తక్కువ. ఆ మాటకొస్తే.. తన సినిమాల అప్డేట్స్ని ప్రభాస్ చెప్పడం చాలా చాలా తక్కువ. దాంతో ఈ స్పెషల్ న్యూస్ కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే అని కొందరి ఊహ. ఒకవేళ ‘సాహో’ సెకండ్ టీజర్, రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్స్ ఒకే రోజు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీటితో కలిపి పెళ్లి అనౌన్స్మెంట్ కూడా వస్తే నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే పండగ. ఇదిలా ఉంటే.. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ యూరోప్ షెడ్యూల్ ఈ నెల చివర్లో స్టార్ట్ కానుంది. అలాగే ప్రభాస్–రాధాకృష్ణ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తయిందట. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీకి ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. -
గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!
ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్లో ఎంతో బిజీగా ఉన్నా.. షాట్ గ్యాప్‌లో షాపింగ్‌కు ట్రైచేశాడీ కుర్ర హీరో. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా... ఓ జ్యువెలరీ షాప్‌ను విజిట్ చేశాడట. అక్కడ రద్దీ ఉండటంతో తిరిగి వచ్చేశాడట. తరువాత నగల వ్యాపారిని తన హోటల్‌కు రప్పించుకొని డైమండ్ రింగ్ కొనేశాడనేది ‘ది మిర్రర్’ కథనం.