ఆస్ట్రియాలో ఆటాపాటా | Prabhas, Shraddha Kapoor and film crew enjoy in Austria | Sakshi
Sakshi News home page

ఆస్ట్రియాలో ఆటాపాటా

Published Sat, Jun 22 2019 12:38 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

Prabhas, Shraddha Kapoor and film’s crew enjoy in Austria - Sakshi

చిత్రబృందంతో ప్రభాస్‌

హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌తో కలిసి ఫారిన్‌లో ప్రేమరాగం తీస్తున్నారు ప్రభాస్‌. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా నటిస్తున్నారని సమాచారం. శ్రద్ధాకపూర్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్స్‌ని కంప్లీట్‌ చేసిన టీమ్‌ ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధాలపై ఆస్ట్రియాలో ఓ పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాటతో ఈ సినిమా షూట్‌ ఆల్మోస్ట్‌ పూర్తయినట్లే. ఈ సినిమాకు జిబ్రాన్‌ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌విజయ్, ‘వెన్నల’ కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మధి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement