
ఈ ఏడాది తన పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్ ఏదో చెబుతానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు ప్రభాస్. అంతే.. ఆ సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్ ఏంటా? అని ఆలోచించే పనిలో పడ్డారు ఫ్యాన్స్. ‘సాహో’ సెకండ్ టీజర్ రిలీజ్ అవుతుందని కొందరు, లేదు.. లేదు.. కె. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఇంకొందరు ఊహిస్తున్నారు. అయితే ప్రభాస్ కెరీర్‌ని పరిశీలిస్తే మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటి వాటిని అవి రిలీజైన తర్వాత మాత్రమే ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ముందు చెప్పడం చాలా తక్కువ. ఆ మాటకొస్తే.. తన సినిమాల అప్‌డేట్స్‌ని ప్రభాస్ చెప్పడం చాలా చాలా తక్కువ.
దాంతో ఈ స్పెషల్ న్యూస్ కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే అని కొందరి ఊహ. ఒకవేళ ‘సాహో’ సెకండ్ టీజర్, రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్స్ ఒకే రోజు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీటితో కలిపి పెళ్లి అనౌన్స్‌మెంట్ కూడా వస్తే నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే పండగ. ఇదిలా ఉంటే.. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ యూరోప్ షెడ్యూల్ ఈ నెల చివర్లో స్టార్ట్ కానుంది. అలాగే ప్రభాస్–రాధాకృష్ణ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తయిందట. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీకి ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment