సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా? | Prabhas to Play Dual Role in Sahoo? - Sakshi
Sakshi News home page

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

Published Tue, Aug 20 2019 1:15 PM | Last Updated on Tue, Aug 20 2019 3:30 PM

Is Prabhas Playing Dual Role in Saaho - Sakshi

సాహో రిలీజ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే సమయముంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఈ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. సాహోలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్‌ చాలా కాలంగా వినిపిస్తోంది.

అయితే పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ల రిలీజ్‌ తరువాత ఆ టాక్‌ మరింత బలపడింది. ప్రభాస్‌ రెండు రకాల హెయిర్‌ స్టైయిల్స్‌తో కనిపిస్తుండటంతో సినిమాలో ప్రభాస్‌ అండర్‌కవర్‌ పోలీస్‌గా, దొంగగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిసన్న ఈ సినిమాను సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement