సాహో.. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే! | Prabhas Gets Huge Remuneration For Saaho | Sakshi
Sakshi News home page

సాహో.. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

Published Tue, Jul 30 2019 4:21 PM | Last Updated on Tue, Jul 30 2019 4:47 PM

Prabhas Gets Huge Remuneration For Saaho - Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి సాహో సినిమాపైనే ఉంది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌ నటించిన సినిమా కావటం.  అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొదించిన సినిమా కావటంతో సాహోపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా సాహోకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త అందరినీ అవాక్కయ్యేల చేస్తోంది.

సాధారణంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకు రావు. అయితే సాహో సినిమాకు సంబంధించిన కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ సినిమాకు ప్రభాస్‌ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనేషన్‌ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీపారితోషికం తీసుకోని యంగ్‌ రెబల్‌ స్టార్‌ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 50 శాతం వాట తన పారితోషికంగా తీసుకోనున్నాడట.

300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా అదే స్థాయిలో జరుగుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ వందకోట్లకు పై మాటే అన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటల సరసన ప్రభాస్‌ నిలవనున్నాడు. అంతేకాదు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల కన్నా ప్రభాస్‌ రెమ్యూనరేషనే ఎక్కువ అవుతుంది.

సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాడేలతో పాటు వెన్నెల కిశోర్‌, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement