రయ్‌.. రయ్‌... | Rebel star Prabhas shares the 2nd poster of Sahoo | Sakshi
Sakshi News home page

రయ్‌.. రయ్‌...

Published Tue, May 28 2019 12:14 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

Rebel star Prabhas shares the 2nd poster of Sahoo - Sakshi

బైక్‌ ఎక్కి ట్రాక్‌ మీద రెడీగా ఉన్నారు ప్రభాస్‌. యాక్సిలేటర్‌ని రయ్‌ రయ్‌మనిపిస్తున్నారు. మరి ప్రభాస్‌ వేగమెంత? దార్లో ఎన్ని వాహనాలను చిత్తు చేశారో తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాల్సిందే. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, ఎవలిన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇటీవలే ప్రభాస్‌ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసిన  చిత్రబృందం తాజాగా బైక్‌ మీద రేస్‌కు దూసుకెళ్తున్న మరో స్టిల్‌ను రిలీజ్‌ చేసింది. ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి కెమెరా: మది. మరోవైపు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాం అని సంగీత దర్శకులు శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement