
ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్... అర్జున్ సురవరం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ లేదని తేల్చి చెప్పేశాడు.
ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘పెద్దన్న ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ తరువాతే అర్జున్ సురవరం రిలీజ్ ఉంటుంద’ని చెప్పాడు. సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే నిఖిల్ సినిమా రిలీజ్‌కు ఇక నెలపైనే సమయముందన్న మాట. ప్రస్తుతానికి ప్రమోషన్ కూడా పక్కన పెట్టేసిన చిత్రయూనిట్, ఇంత గ్యాప్ తరువాత ఈ మూవీపై తిరిగి హైప్ తీసుకురావటంలో ఎంతవరకు సక్సెష్ అవుతుందో చూడాలి.
కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన కనితన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం మూవీలో నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటించారు. ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు.
The wait will b worth.. After pedannas Saaho... release of #ArjunSuravaram #WaitingForArjunSuravaram https://t.co/LPQsdd3M9j
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 27, 2019