'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్ | Nikhil Siddhartha Latest Movie Appudo Ippudo Eppudo Movie Official Teaser Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Appudo Ippudo Eppudo Movie: 'తెల్ల పిల్లను పడేసి ప్రపంచం చుట్టేద్దామనుకున్నాడు'.. టీజర్‌ అదుర్స్

Published Fri, Oct 11 2024 5:03 PM | Last Updated on Fri, Oct 11 2024 6:15 PM

Nikhil Siddhartha Latest Movie appudo ippudo eppudo Teaser Out Now

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ పాన్‌ ఇండియా చిత్రానికి  భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా దసరా సందర్భంగా ఆయుధ పూజకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్.

అయితే ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్ రివీల్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూస్తుంటే లవ్‌ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లండన్‌ వెళ్లి తెల్లపిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకున్నాడు అనే డైలాగ్ వింటే లవ్ అండ్ యూత్‌ఫుల్‌ స్టోరీ అని అర్థమవుతోంది. 90 శాతం మంది అబ్బాయిలు మందు తాగడానికి కారణం అమ్మాయిలేరా అనే నిఖిల్ డైలాగ్‌ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతే కాకుండా హర్ష చెముడు కామెడీ ఈ సినిమాకు ప్లస్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‍శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement