
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆగడిక సైకో సయ్యారే అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌కు గిలిగింతలు పెడుతోంది. ప్రభాస్, శ్రద్ధ తమ స్టైలిష్ స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
కాగా ఈ సినిమాకు సంగీత దర్శకులుగా ముందు శంకర్ ఇషాన్ లాయ్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సంగీత త్రయం సాహో నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. శంకర్ ఇషాన్ లాయ్‌లు తప్పుకున్న విషయాన్ని దృవీకరించిన సాహో టీం తరువాత సంగీత బాధ్యతలను తనిష్క్ బాగ్చికి అప్పగించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గిబ్చాన్ అందిస్తున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment