
‘సాహో’ గేమ్ పోస్టర్
పోస్టర్, టీజర్‌లు చూస్తుంటే ‘సాహో’లో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయని అర్థమవుతోంది. ఈ యాక్షన్‌ను మీరూ ఫీల్ అవ్వండి అంటూ ‘సాహో’ గేమ్‌ను తయారు చేసింది చిత్రబృందం. రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది టీమ్. ‘సాహో: ది గేమ్’ పేరుతో ఓ గేమ్‌ను రెడీ చేస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment