game plan
-
గేమ్ ప్లాన్ : బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ‘మిషన్–150’
దాదర్: ఇటీవల జరిగిన అసెంబీ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విధంగా ఎక్కువ స్థానాలు రావడంతో త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది. అందుకు దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ), ఏక్నాథ్ శిందే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి మొత్తం 227 స్థానాల్లో 150కి పైగా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ‘మిషన్–150’ పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే–శివసేనను ఈసారి ఎలాగైనా గద్దె దింపాలని మహాయుతి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. నెల, రెండు నెలల్లో ఎన్నికలు! బీఎంసీ ఎన్నికలు 2025, జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మహాయుతి కూటమి వర్గాలు కొంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. వాస్తవంగా బీఎంసీ కార్యనిర్వాహక పాలన గడువు 2022 మార్చిలో ముగిసింది. ఫలితంగా ఇదివరకే ఎన్నికలు జరగాలి. కానీ అనేక సార్లు వివిధ కారణాలవల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. దీంతో 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు లేకపోవడంతో అనేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఆనేక శాఖల్లో కార్యకలాపాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ఇతర పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో బీఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల పర్వం ఇటీవల పూర్తికావడంతో ఇక అన్ని పార్టీల దృష్టి బీఎంసీ ఎన్నికలపై పడింది. భారీ మెజార్టీ సాధించిన మహాయుతి కూటమి ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనేలేదు. అప్పుడే బీఎంసీ ఎన్నికల్లో భారీ సీట్లు రాబట్టుకోవాలని మిషన్–150 పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 2017లో 227 స్థానాలకు జరిగిన బీఎంసీ ఎన్నికల్లో అప్పట్లో శివసేన–బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్–31, ఎన్సీపీ–9 మంది కార్పొరేటర్లు గెలిచారు. కానీ ఇప్పుడు జరిగే బీఎంసీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయి నాలుగు పార్టీలుగా అవతరించాయి. శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే వర్గంగా, ఎన్సీపీ శరద్ పవార్, అజిత్ పవార్ వర్గంగా ఏర్పడ్డాయి. దీంతో బీఎంసీ ఎన్నికల్లో ఎవరి వర్గం కార్పొరేటర్లు ఆ వర్గం నుంచి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండున్నరేళ్ల కిందట శిందే శివసేనతో తెగతెంపులు చేసుకుని బయటపడ్డారు. ఆ సమయంలో శిందే వెంట పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కూడా బయట పడ్డారు. దీంతో ఈ సారి జరిగే బీఎంసీ ఎన్నికల్లో శివసేన కొంత బలహీన పడినట్లు తెలుస్తోంది. యూబీటీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిపోయాయి. దీని ప్రభావం బీఎంసీ ఎన్నికల్లో కచి్చతంగా చూపే ప్రమాదం లేకపోలేదు. దీంతో బీజేపీ చేపట్టిన మిషన్–150 కచ్చితంగా సఫలీకృతమవుతుందని తెలుస్తోంది. మరోపక్క మహా వికాస్ అఘాడీ కూడా ఏదో ఒక కొత్త వ్యూహం లేదా కొత్త పంథాతో ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయనుంది. దీంతో ఈ ఎన్నికలు కూడా అసెంబ్లీ లాగే మహాయుతి, మహా వికాస్ అఘాడీ మధ్య హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లతో మంతనాలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఎలాంటి ప్రచార అస్త్రాలతో ప్రజల ముందుకు వెళ్లాలని వ్యూహం రచిస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కులాలవారీగా, మహిళలకు ఇలా వేర్వేరుగా రిజర్వేషన్లు ఉంటాయి. దీంతో ఏ వార్డు ఏ కులానికి, మహిళకు లేదా పురుషుడికి రిజర్వేషన్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ తరువాతే గెలిచే సత్తా ఉన్న అర్హులైన అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. దీంతో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొగెస్ రిపోర్టు పరిశీలించాలి. -
విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్ కొట్టబోతున్నాం: రోహిత్
ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ 209 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా అప్పటినుంచి మళ్లీ మరో కప్ కొట్టేలేకపోయింది. ధోని తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లి 2019 వన్డే వరల్డ్‌కప్ , 2021 టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. అదే ఏడాది జరిగిన 2021 డబ్ల్యూటీసీ తొలి ఛాంపియన్‌షిప్‌లోనూ కోహ్లి సారధ్యంలోని టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. దీంతో కోహ్లి నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మకు కూడా ఏది కలిసిరావడం లేదు. 2022 టి20 వరల్డ్‌కప్‌తో పాటు ఆసియా కప్ 2022.. తాజాగా డబ్ల్యూటీసీ 2023లోనూ టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. పైగా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ పనికిరాడని.. వెంటనే అతన్ని తొలగించాలంటూ అభిమానులు ట్విటర్లో డిమాండ్ చేయడం ఆసక్తి కలిగించింది. అయితే ఈ విమర్శలు పట్టించుకోని రోహిత్ అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌పై తన దృష్టిని సారించాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. స్వదేశంలో మెగాటోర్నీ జరుగుతుండడంతో ఈసారి కప్ టీమిండియాదేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి అనుసరించబోతున్న గేమ్ స్ట్రాటజీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ''అక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మెగాటోర్నీలో విభిన్నమైన ఆటతీరుతో రాణించేందుకు ప్రయత్నిస్తాం. తప్పకుండా అభిమానులను అలరించేందుకు తీవ్రంగా కృషి చేస్తాం. ఈ మ్యాచ్ గెలవాలి.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించాలని మాత్రమే ఆలోచించం. ప్రతి మ్యాచ్ మాకు చాలా ముఖ్యమని భావిస్తాం. అందుకోసం మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామనడంలో సందేహం లేదు. ఈసారి వన్డే వరల్డ్‌కప్‌ను విభిన్నంగా ఆడి కప్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నాం.'' అని పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మకు 2023 వన్డే వరల్డ్‌కప్ అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా చివరిదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అతని వయసు 36 ఏళ్లు. ఫిట్నెస్ దృష్యా చూసుకుంటే రోహిత్ వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రిటైర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్; భారత్ ఘన విజయం -
'సెంచరీగా మలిచి ఉంటే బాగుండేది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో కోల్‌కతాపై విజయం తమ జట్టులో జోష్ నింపిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం జట్టు సమిష్టి ప్రదర్శనపై రోహిత్ స్పందించాడు.' చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా గేమ్‌ప్లాన్‌ను మార్చాలనుకున్నాం. అందుకు తగ్గట్టే కోల్‌కతాతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో దూకుడుగా ఆడాలనే నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్టే మా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. గేమ్‌ప్లాన్ సరిగ్గా రావడంతో మ్యాచ్ గెలిచాం. దీనికి తోడు జట్టు సమిష్టి ప్రదర్శన కలిసొచ్చింది. ఇక నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. 54 బంతులెదుర్కొని 80 పరుగులు చేయడం సంతోషమే.. దానిని సెంచరీగా మలిస్తే బాగుండేది. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో జరిగిన పొరపాటును రిపీట్ కాకుండా చూసుకోవాలనుకున్నా. అందుకు తగ్గట్టే ఆడుతూ.. పిచ్ నా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత బ్యాట్ ఝుళిపించా. (చదవండి : కమిన్స్ విఫలం వెనుక కారణం ఇదే) అంతేగాక మధ్య ఓవర్లలో ఎంతసేపు నిలబడితే చివర్లో అంత వేగంగా పరుగులు సాధిస్తామనే 50 పరుగులు తర్వాత కాస్త నెమ్మదించాను. కానీ అనూహ్యంగా 80 పరుగుల వద్ద ఔట్ కావాల్సి వచ్చింది. అప్పటికే అలసిపోయాను అనే ఫీలింగ్ కలిగింది.. దాంతో సెంచరీ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలగలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మా జట్టు ముందు మ్యాచ్‌తో పోలిస్తే చాలా మెరుగుపడింది. జట్టుతో ఆలస్యంగా కలిసినా బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని ముందు మేం ఊహించలేదు. కానీ మా పేస్ పవర్ ముంబై వాంఖడేలో సరిగ్గా సరిపోయేది. కానీ ఇక్కడ స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్నా.. మా బౌలర్లు మంచి ప్రదర్శనే కనబరిచారు. రానున్న రోజుల్లో దీనిని ఇలాగే కొనసాగిస్తామ’ని చెప్పకొచ్చాడు. కాగా రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో 10 పరుగులు చేస్తే 5 వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులెక్కనున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఐపీఎల్లో 190 మ్యాచ్‌ల్లో 4990 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ కంటే ముందు కోహ్లి, రైనాలు ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించారు. రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విండీస్ స్టార్ క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) పేరిట ఉంది. గేల్ 326 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్ 214, ఎంఎస్ ధోనీ 212 సిక్సర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. సురేష్ రైనా 194 సిక్సర్లతో టాప్ 5లో ఉన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సెప్టెంబర్ 28న తలపడనుంది. (చదవండి : కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!) -
సాహో: ది గేమ్
పోస్టర్, టీజర్లు చూస్తుంటే ‘సాహో’లో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయని అర్థమవుతోంది. ఈ యాక్షన్‌ను మీరూ ఫీల్ అవ్వండి అంటూ ‘సాహో’ గేమ్‌ను తయారు చేసింది చిత్రబృందం. రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది టీమ్. ‘సాహో: ది గేమ్’ పేరుతో ఓ గేమ్‌ను రెడీ చేస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. -
ఇంగ్లండ్ ప్లాన్ ప్రకారమే ఓడిందా..?
మాస్కో : ఏ టోర్నీలోనైనా ఆడే ప్రతీ మ్యాచ్ గెలవాలని అన్ని జట్లు కోరుకుంటాయి. అందులోనూ ఫిఫా వంటి మెగా టోర్నీలో ప్రతీ మ్యాచ్ ఫైనల్ పోరును తలపిస్తూ ఉంటుంది. కాగా, లీగ్ దశలో బెల్జియంపై ఇంగ్లండ్ ఆడిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. ఆ జట్టు గెలుపు కంటే కూడా ఓటమి కోసం ఎక్కువ శ్రమించినట్లు కనబడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఫిఫా ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడకమందే ఇంగ్లండ్, బెల్జియం జట్లు నాకౌట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ జీలో టాప్ స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం1-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ రౌండ్16లోకి అడుగుపెట్టింది. అయితే ఇంగ్లండ్ జట్టు పక్కా గేమ్ ప్లాన్ ప్రకారమే బెల్జియంపై ఓడిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఇంగ్లండ్‌కు అన్ని అనుకూలిస్తే క్వార్టర్స్‌లో బలమైన బ్రెజిల్ ప్రత్యర్థిగా ఎదురయ్యే పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా సాంబా జట్టు నుంచి ముప్పు తప్పించుకోవడానికే బెల్జియంపై ఇంగ్లండ్ ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లండ్ నాకౌట్లో కొలంబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినట్లయితే మరో నాకౌట్ మ్యాచ్‌లో స్వీడన్, స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్‌తో పోలిస్తే వీటి(స్వీడన్, స్విస్)పై గెలవటం సులభం అనే ఉద్దేశంతో బెల్జియం పై ఓడిపోయిందనేది విశ్లేషకుల వాదన. బెల్జియంతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఏ కేటగిరి ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయటంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించని ఇంగ్లండ్ ఆటగాళ్లు సాదాసీదాగా ఆడి మ్యాచ్‌ను ఓటమితో ముగించారు. మ్యాచ్‌లో పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే మిస్ చేశారు. సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోతే కోచ్ ఆగ్రహాన్ని చవిచూడటం పరిపాటి. అటువంటిది మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కోచ్ ఆటగాళ్లను అభినందిస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది. ఇక బెల్జియంకు కూడా ఇంగ్లండ్‌పై గొప్ప రికార్డేమి లేదు. 1936(82 సంవత్సరాల) తర్వాత ఇంగ్లండ్‌పై బెల్జియం గెలవడం ఇదే తొలిసారి. -
చైనా అతి తెలివి
కరచాలనం చేస్తూనే కత్తి దూయడం దౌత్యం అనిపించుకోదు. అందువల్ల ఫలితం లేకపోగా అంతంతమాత్రంగా ఉన్న మైత్రీ సంబంధాలకు సైతం విఘాతం కలుగుతుంది. ఈ సంగతి చైనాకు సరిగా అర్ధమైనట్టు లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించారు. ఆ రాష్ట్ర సంస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అరుణాచల్ మన దేశంలో అంతర్భాగం కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టే మోదీ అయినా, మరో అధినేత అయినా ఆ రాష్ట్రానికి కూడా వెళ్తారు. కానీ అలా వెళ్లిన ప్రతిసారీ నిరసన వ్యక్తం చేయడం చైనాకు రివాజుగా మారింది. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తమ పదవీకాలాల్లో అక్కడి కెళ్లినప్పుడు కూడా ఈ రకంగానే ‘అభ్యంతరం’ చెప్పింది. ఆ భూభాగం తమదేనని చైనా చాన్నాళ్ల నుంచి వాదిస్తున్నది. ఇరు దేశాలమధ్య ఉన్న సరిహద్దు వివాదాల్లో ఆ భూభాగానికి సంబంధించిన అంశం కూడా ఉంది. తమ భూభాగం సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత్ స్వాధీనంలో ఉందని చైనా ఆరోపిస్తుండగా...38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా దురాక్రమించిందని మన దేశం చెబుతున్నది. ఈ విషయంలో పరస్పరం చర్చించుకుని ఒక ఒడంబడికకు వద్దామని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఈలోగా యథాతథస్థితిని కొనసాగిద్దామని అనుకున్నాయి. అలాంటపుడు అరుణాచల్‌పై చైనా పదే పదే అభ్యంతరం చెప్పకూడదు. అలా మిన్నకుండలేదు సరిగదా ఇప్పుడు మరికాస్త ముందుకుపోయింది. మన నేతలు అరుణాచల్ వెళ్లినప్పుడు గతంలో కేవలం ప్రకటనద్వారా నిరసన వ్యక్తం చేయడంతో సరిపెట్టేది. అధికారిక వార్తాసంస్థ ద్వారా తన మనోగతాన్ని ప్రచారంలో పెట్టేది. ఈసారి చైనాలోని మన రాయబారి అశోక్ కాంతాను విదేశాంగ మంత్రిత్వశాఖకు పిలిపించుకుని ఆ దేశ విదేశాంగ ఉపమంత్రి లియూ జెన్మిన్ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. భారత్ చర్య చైనా సార్వభౌమత్వాన్ని, హక్కులను, ప్రయోజనాలను కించపరిచేవిధంగా ఉన్నదని చెప్పారు. అంతేకాదు...ఇరు దేశాల మధ్యా ఉన్న సరిహద్దు విభేదాలను ఇది ‘కృత్రిమంగా’ ఎక్కువ చేస్తున్నదని ఆరోపించారు. వివాదాస్పద ప్రాంతాన్ని పర్యటన కోసం ఎంచుకోవడంపై తీవ్ర అసంతృప్తిని, అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలా పిలిపించడానికి ముందు రోజు చైనా విదేశాంగ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి మాటలతోనే ప్రకటన చేశారు. చైనా ప్రభుత్వం అరుణాచల్‌ను గుర్తించడంలేదని, ఆ ప్రాంతానికి మోదీ వెళ్లడం తమకు సమ్మతం కాదని చెప్పారు. కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే సాధారణ పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా ప్రస్తావించేది కాదు. గత కొన్నేళ్లుగా ఆ బాణీ మారింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా వ్యవహరించడం ప్రారంభించింది. ఈమధ్య ఇంకాస్త ముందుకెళ్లింది. అందులో కొన్ని ‘సబ్ డివిజన్’లను ‘సృష్టించి’ వాటికి టిబెటిన్ పేర్లు పెట్టుకుని తరచుగా వల్లె వేస్తున్నది. ఇదంతా అత్యుత్సాహంతోనో, అనుకోకుండానో చేస్తున్న పనికాదు. ఆ పేర్లను పదే పదే చెప్పడంద్వారా ఆ ప్రాంతం చారిత్రకంగా తమదేనని నిర్ధారణ చేయడం చైనా చర్యలోని ఆంతర్యం. భారత్‌తో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూనే దౌత్య సంప్రదాయాలకు విరుద్ధమైన పదజాలంతో ప్రకటనలు చేయడం చైనాకు కొత్తకాదు. నిరుడు సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మన దేశ పర్యటనలో ఉండగా ఆ దేశ సైన్యం సరిహద్దుల్లో వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ దేశాధ్యక్షుడు భారత్ అతిథిగా పర్యటనలో ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా చైనా సైన్యం తమ పౌరులను రెచ్చగొట్టి మన భూభాగంలోకి ప్రవేశపెట్టింది. అక్కడ నిర్మాణం పనులు జరుగుతున్నచోట ఘర్షణను ప్రేరేపించడానికి ప్రయత్నించింది. ఇలాంటి చేష్టలు ఇరు దేశాలమధ్యా అపనమ్మకాన్ని పెంచుతాయని, చెలిమికి అడ్డువస్తాయని చైనా గుర్తించడం లేదు. అంతక్రితం మాటెలా ఉన్నా జనతా ప్రభుత్వ హయాంలో ఆనాటి విదేశాంగమంత్రి వాజపేయి చైనా పర్యటించాక సంబంధాలు మెరుగవడం ప్రారంభించాయి. 1988 తర్వాత ఆ దిశగా మరిన్ని ప్రయత్నాలు సాగాయి. ఇరు దేశాలమధ్యా అనేకసార్లు శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించడం మొదలైంది. సాంస్కృతిక సంబంధాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం రెండు దేశాలమధ్యా 6,500 కోట్ల డాలర్లమేర వాణిజ్యం సాగుతున్నది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఇరు దేశాలూ కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే జీ జిన్‌పింగ్ వచ్చారు. మోదీ వచ్చే మే నెలలో చైనా వెళ్లబోతున్నారు. నిజానికి మోదీ పర్యటన జయప్రదం చేయడంలో భాగంగా ఇటీవలే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశం వెళ్లారు. సరిహద్దు వివాదం విషయంలో ఈసారి మనవైపు ‘భిన్నమైన ప్రతిపాదనలు’ వెలువడే అవకాశం ఉన్నదని ఆమె చెప్పారు. పాకిస్థాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ల విషయంలో చైనా ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నదో, అందుకు కారణలేమిటో తెలిసినా మన దేశం చైనాతో కలిసి బీసీఐఎం (బంగ్లా, చైనా, ఇండియా, మయన్మార్) ఆర్ధిక కారిడార్‌కు సరేనన్నది. పాకిస్థాన్‌తో చైనాకు అణు బంధం ఉన్నదని తేటతెల్లమైనా ఆ దేశంతో అణు విద్యుత్ ఒప్పందం కుదర్చుకోవడానికి సిద్ధపడింది. అయినా చైనా అమిత్ర చర్యకు పాల్పడుతున్నది. మోదీ చైనా పర్యటన సమయానికల్లా సరిహద్దు వివాదంలో తమది రాజీపడని వైఖరిగా చాటాలని, ఆ మాటున భారత్‌ను తన దారికి తెచ్చుకో వాలని చూస్తున్నది. మన ప్రభుత్వం చైనా తాజా అడుగులను గమనించి అందుకు దీటుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గిల్లికజ్జాలు పెట్టుకునే విధానం దౌత్యంలో పనికిరాదని, దానివల్ల సాధించేదేమీ ఉండదని చాటాల్సి ఉంది. -
పథకం ప్రకారమే తప్పించారు
-
పథకం ప్రకారమే తప్పించారు
హైకమాండ్ వ్యూహం మేరకే శ్రీధర్‌బాబు శాఖ మార్పు పార్టీ అధిష్టానం అనుమతి తీసుకునే మార్పు చేపట్టిన కిరణ్ విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేలా చూడటమే సీఎం లక్ష్యం బిల్లును తానే అడ్డుకుంటున్నాననే భావనా కల్పించే పథకం సాక్షి. హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ‘రోడ్ మ్యాప్’ను అమలు చేయిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిని మార్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. శాసనసభ మలివిడత సమావేశాలు ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. శాసనసభా వ్యవహారాల శాఖను దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరో మంత్రి సాకే శైలజానాథ్‌కు అప్పగించడం.. హైకమాండ్ ఆదేశాలను అమలు చేయడంలో తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం, సీఎం తనకు తానుగా సమైక్యాంధ్ర చాంపియన్ అనిపించుకోవడమన్న రెండు లక్ష్యాలను సాధించుకోవడానికేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ‘నేను కొట్టినట్టు చేస్తా.. మీరు ఏడ్చినట్టు చేయుండి...’ అన్నట్టుగా సీఎం కిరణ్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజన బిల్లును మరో 24 గంటల్లో అసెంబ్లీలో చర్చకు చేపట్టాల్సిన తరుణంలో ఉన్నట్టుండి శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించడం ద్వారా రాజకీయవర్గాల్లో ఒక చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే కిరణ్ కావాలనే ఈ చర్యకు దిగారని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించడం ద్వారా తెలంగాణ వాదుల నుంచి తనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయని, తద్వారా సీమాంధ్రలో తాను ఒక్కడే సమైక్యం కోసం పనిచేస్తున్నట్టు ప్రజలు భావిస్తారన్న లక్ష్యంతోనే కిరణ్ తాజా చర్యకు దిగినట్టు చెప్తున్నాయి. అనుకున్నట్టుగానే తెలంగాణ మంత్రులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఈ విషయమై కిరణ్‌పై ఫిర్యాదు చేయడాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. విభజన బిల్లు తిరిగి వెళ్లదుగా..? కిరణ్ వ్యూహాత్మకంగానే ఈ చర్యకు దిగారని చెప్పేందుకు పరిశీలకులు పలు అంశాలను విశ్లేషిస్తున్నారు. ‘శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరొకరికి అప్పగించినంత వూత్రాన అసెంబ్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తిరిగి వెనక్కి వెళ్లదు. ఒకవేళ విభజన బిల్లును శాసనసభలో అడ్డుకోవాలనుకుంటే ఇంకేదైనా మార్గం ఎంచుకోవాలి. అంతే తప్ప దానికి శాసనసభ వ్యవహారాల శాఖ వుంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు. విభజన బిల్లుపై సభలో చర్చ జరపాలని గానీ వద్దనిగానీ చెప్పే అధికారం గానీ ఆ మంత్రికి లేదు. శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ పర్యవేక్షణలో మాత్రమే సమావేశాలు సాగుతాయి. బీఏసీ సమావేశం జరిగినప్పుడు జనవరి 23 వరకు బిల్లుపై చర్చిద్దామని ప్రతిపాదించిందే ముఖ్యమంత్రి. ఆ మేరకే అసెంబ్లీ ఎజెండా ఖరారైంది కూడా. బీఏసీ నిర్ణయూలపై అసెంబ్లీ నోట్ విడుదల చేయూలి. కానీ ఆ సంప్రదాయూనికి భిన్నంగా ఆ రోజున ప్రత్యేకంగా సీఎం పేరుతో నోట్‌ను విడుదల చేశారు. సమావేశాలను సవ్యంగా జరిపించడంలో స్పీకర్‌కు సహకరిస్తూ ప్రభుత్వానికి, మిగిలిన పక్షాలకు మధ్య సమన్వయం చేయడం తప్ప చర్చ వద్దని చెప్పడం గానీ ఇతర పక్షాలు, సభ్యుల వాదనను గానీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అడ్డుకోలేరు’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు నెలల్లో ఆదాయం పెంచగలరా? ‘ఇక మంత్రిత్వ శాఖల విషయానికి వస్తే ఒక్క వాణిజ్యపన్నుల శాఖే కాదు రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో అత్యంత కీలకమైన హోంశాఖ, ఎక్సయిజ్, విద్యుత్ వంటి ముఖ్యమైన శాఖలన్నీ సీఎం వద్దే ఉన్నాయి. ఎంతో కాలంగా ఆ శాఖలకు మంత్రులెవరినీ కిరణ్ నియమించలేదు. తవుకు కీలక శాఖలు కాకుండా చిన్న శాఖలు ఇచ్చారని సీనియుర్ వుంత్రులు తీవ్ర అసంతృప్తితో అధిష్టానానికి ఫిర్యాదులు పంపినా సీఎం తనవద్ద అదనంగా ఉన్న కీలక శాఖలను వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాజాగా స్వయంగా ఆయన పర్యవేక్షణలో ఉన్న వాణిజ్యశాఖ ద్వారా రాబడి తగ్గిపోయిందని.. ఇంత కాలం తర్వాత.. అది కూడా మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఆ శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించడం అర్థంలేనిదని అందరికీ స్పష్టవువుతోంది. పైగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే పెట్టగలదే తప్ప వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టజాలదు. అలాంటప్పుడు ఆగమేఘాలపై వాణిజ్య పన్నుల రాబడిని పెంచాలన్న అంశంపై ఇప్పుడు దృష్టి సారించడాన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి చెప్తున్న వాదనలో ఏ మాత్రం పసలేదని తేలిపోతోంది’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సైమైక్యవాదిగా చెప్పుకునే డ్రామా... ‘మంత్రుల శాఖలను మార్చడం, చేర్చుకోవడం, తొలగించడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రికి సర్వ అధికారాలు ఉంటాయి. ఉన్నట్టుండి సీఎంకు వాణిజ్య పన్నుల రాబడిపై ఆందోళన ఉన్నట్టయితే ఆ కీలకమైన శాఖను మరో మంత్రికి అదనంగా అప్పగించవచ్చు. లేదా కొత్త వ్యక్తికి అప్పగించవచ్చు. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేతిలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ సరైన ఫలితాలు చూపించలేనప్పుడు మరో మంత్రి మాత్రం అధికాదాయన్ని రాబట్టడం సాధ్యమవుతుందా?’ అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే.. ప్రస్తుత కేబినేట్లో శ్రీధర్‌బాబు మొదటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుందని గుర్తుచేస్తున్నారు. ‘పైగా సీఎం నిర్ణయాలకు, ఆదేశాలకు వ్యతిరేకంగా శ్రీధర్‌బాబు వ్యవహరించింది కూడా ఏమీ లేదు. డిసెంబర్ 12న ప్రారంభమైన శాసనసభ తొలి విడత సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ బీఏసీ నిర్వహించగా, ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. ఆయన తరఫున ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమావేశాల అజెండాను అంగీకరించారు. విభజన బిల్లుపై చర్చకు సంబంధించిన అజెండా ఖరారు చేయడానికి రెండోసారి బీఏసీ సమావేశమైనప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే జనవరి 23 వరకు చర్చ జరగాలని కోరడం, ఆ మేరకు అసెంబ్లీ షెడ్యూలు విడుదల చేయడం జరిగిపోయింది. ఇంత జరిగాక ఇంకా ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అదనంగా చేసేదేమీ ఉండదు. సభా వ్యవహారాల వుంత్రిగా శ్రీధర్‌బాబు.. సీఎం కిరణ్ వ్యూహాలను అడ్డుకునేదీ ఏమీ ఉండదు. అరుునా సీఎం ఆయున నుంచి ఆ శాఖను తప్పించడం కేవలం సమైక్యవాదిగా చెప్పుకొనేందుకు వేసిన ఒక డ్రావూ వూత్రమేనని స్పష్టవువుతోంది’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అందివచ్చిన అవకాశంగా... కేబినేట్లో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీధర్‌బాబు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది సుస్పష్టమని పరిశీలకులు చెప్తున్నారు. ‘శ్రీధర్‌బాబు శాఖను మార్చినట్టే మార్చి ప్రాధాన్యత కలిగిన వాణిజ్యపన్నుల శాఖను కట్టబెట్టారు. విభజన బిల్లు శాసనసభలో స్పీకర్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చను ప్రారంభించాలని శ్రీధర్‌బాబు సభలో కోరడం, ఆ తర్వాత చర్చ ప్రారంభమైందని సభ బయట చెప్పడం, గతంలో అసెంబ్లీ ప్రొరోగ్ చేయడానికి సంబంధించిన ఫైలు పంపకుండా తనవద్దే పెట్టుకోవడం వంటి అంశాలను ముఖ్యమంత్రి తనకుఅందివచ్చిన అవకాశంగా మార్చుకున్నారు. శ్రీధర్‌బాబును మార్చితే తెలంగాణ వాళ్లకు కోపమొస్తుంది. విభజనను అడ్డుకోవడానికి మాత్రమే ఈ పని చేశారని సీమాంధ్రలో తనకు సమైక్యవాదినన్న పేరు దక్కుతుంది. ఈ ప్లాన్ ప్రకారమే ఈ శాఖల వూర్పు చేసినట్టు సీఎం తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని వారు పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్ర కేబినేట్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఎన్నో విబేధాలున్నాయని, దామోదర రాజనర్సింహ సూచించిన ఏ పని జరక్కుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయని, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారినే సీఎం తప్పించాలనుకుంటే ఆ జాబితాలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు ఉన్నారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆది నుంచీ అంతే... ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై పార్టీలోని సీమాంధ్ర నేతలు మొదటి నుంచీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఇవ్వాలని తీర్మానం చేసింది మొదలుఇప్పటివరకు అనేక దశల్లో రాష్ట్ర విభజనను కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న భావన కల్పించుకుంటున్నారే తప్ప విభజనను అడ్డుకునే పని ఒక్కటి కూడా చేయలేదని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలే చెప్తుంటారు. ‘హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకున్న రోజే సీఎం రాజీనామా చేసి ఉంటే అసలు అసెంబ్లీ ఉండేది కాదు.. ఈ చర్చకు ఆస్కారమే లేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ కమిటీ విభజనపై నివేదికను సమర్పించకముందు, కేంద్ర కేబినెట్ విభజన ముసాయిదా బిల్లును ఆమోదించకముందు, ఆ బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి రాకముందు.. ఇలా ఎన్నో దశల్లో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ముందుగా పంపించవచ్చు. కానీ.. అన్ని దశల్లోనూ తానే అడ్డుకుంటానంటూ మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్.. అంతర్గతంగా విభజనకు సహకరిస్తూ వస్తున్నారు. ఏదీ చేయకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన కల్పించడంలో కిరణ్ చాలా తెలివిగా బిల్లును అసెంబ్లీ వరకు వచ్చేట్టు వ్యవహారాలు నడిపించారు. చివరికి.. ఇటీవల కిరణ్‌కు సన్నిహితుడుగా ఉండే ఏపీఎన్జీవో సంఘ నేత ఒకరు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అఫిడవిట్లు అందించాలనీ నిర్ణయించారు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు.. కొన్ని రోజుల విడిది అనంతరం ఢిల్లీ కూడా వెళ్లిపోయారు.. కానీ కిరణ్ మాత్రం అఫిడవిట్ల ఊసే ఎత్తలేదు’ అని సీమాంధ్ర సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. హైకమాండ్ అనుమతితోనే... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కూడా మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ‘మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేసుకోవడానికి అవకాశమివ్వాలని సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి చెప్పుకున్నా హైకమాండ్ అంగీకరించలేదు. అలాంటిది ఈ కీలక సమయంలో తెలంగాణకు చెందిన శ్రీధర్‌బాబు శాఖను ఉన్నట్టుండి మార్చే సాహసం.. పార్టీ హైకమాండ్ ఆదేశాలు లేకుండా ముఖ్యమంత్రి చేయరు’ అని వారు స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడు కూడా సీఎం కిరణ్ తన తాజా నిర్ణయంపై ముందుగానే హైకమాండ్ పెద్దలతో చర్చించి, వారి ఆమోదం మేరకే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో విభజన బిల్లుపై చర్చ జరక్కుండా వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి సమైక్యవాద పార్టీలు అడ్డుకునే అవకాశాలు ఉండటంతో ముందుగానే తానే ఏదో చేశానన్న అభిప్రాయం కల్పించడానికి సీఎం హైకమాండ్ పెద్దలతో మాట్లాడి శ్రీధర్‌బాబును మార్చినట్టు ఆ వర్గాల సమాచారం. అదీగాక.. ‘అసెంబ్లీ ప్రొరోగ్ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపకుండా శ్రీధర్‌బాబు తన వద్దే పెండింగ్‌లో పెట్టుకున్నారన్న విషయంలో ఆగ్రహంగా ఉండి ఉంటే ఆ రోజే ఆయనను ముఖ్యమంత్రి భర్తరఫ్ చేసేవారు. లేదా అప్పుడే శాఖను మార్చేవారు’ అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘పైగా విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందని బీఏసీ సమావేశంలో శ్రీధర్‌బాబు చెప్పినప్పుడు సీమాంధ్రకు చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. అయిందేదో అయిపోయింది.. దాన్ని వివాదం చేసి పెద్దది చేయకండని చెప్పిందే ముఖ్యమంత్రి’ అని ఆ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. శైలజానాథ్ చేసేదేంటి? శ్రీధర్‌బాబు నుంచి అసెంబ్లీ వ్యవహారాలను తప్పించి మరో మంత్రి శైలజానాథ్‌కు అప్పగించగా.. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సమావేశాల్లో ఆ శాఖ మంత్రిగా ఆయున పెద్దగా చేసే కార్యక్రమాలేవీ లేవని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘బీఏసీలో అజెండా ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. విభజన బిల్లు సందర్భంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చ జరిగిన తీరును పరిశీలించి వచ్చిన స్పీకర్ అవసరమైతే ఆ విషయాలను వెల్లడించడానికి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లేదా ముఖ్యమంత్రి అనుమతి మేరకు మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసే ఆస్కారం కూడా ఉంది. విభజన బిల్లుపై చర్చ జరగాలని తెలంగాణ నేతలు కోరుతుండగా, సమైక్యవాదులు చర్చను అడ్డుకునే అవకాశముంది. ఇంతకాలం సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న శైలజానాథ్‌ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా చేసి ఇప్పుడు సభలో కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా చూసే బాధ్యతలను ఆయనకే సీఎం కిరణ్ అప్పగించారు. ఇదీ కిరణ్ వ్యూహంలో భాగమే’ అని వారు విశ్లేషిస్తున్నారు. శాసనసభలో సమైక్యవాదానికి వుద్దతు లేకుండా చేయుడానికే సీఎం వ్యూహాత్మకంగా ఆ గొంతులూ నొక్కేలా ఈ శాఖల వూర్పు చేశారన్న అనువూనాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తవువుతున్నారుు. -
సీఎం కిరణ్ సరికొత్త గేమ్ ప్లాన్