ఎనిమిది కిలోలు తగ్గాను | prabhas loses 8 kg weight for saaho | Sakshi
Sakshi News home page

ఎనిమిది కిలోలు తగ్గాను

Published Tue, Apr 30 2019 2:04 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

prabhas loses 8 kg weight for saaho - Sakshi

ప్రభాస్‌

‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్‌ ఆహార్యం గొప్పగా ఉంటుంది. ఆ సినిమాలో రాజు పాత్ర కాబట్టి రాజసం ఉట్టిపడేలా తన ఫిజిక్‌ని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాకోసం ఆయన ఎనిమిది కిలోలు తగ్గారు. ‘‘బాహుబలి’ సినిమా కోసం చాలా బరువు పెరిగాను. కానీ ‘సాహో’ చిత్రానికి బరువు తగ్గాల్సి వచ్చింది. సరైన కార్బోహైడ్రేట్స్‌ డైట్‌తో దాదాపు ఎనిమిది కిలోలు తగ్గాను. ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఈ సీన్లు పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం హాలీవుడ్‌ స్టంట్‌ నిపుణుల సహాయం తీసుకున్నాం.

యాక్షన్‌తోపాటు సినిమాలో అద్భుతమైన లవ్‌స్టోరీ కూడా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌తో నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఆడియన్స్‌ కూడా ఇదే ఫీల్‌ అవుతారని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రభాస్‌. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ‘సాహో’ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న ‘సాహో’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘జాన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా చేస్తున్నారు.

ఎప్పటి ప్రభాస్‌నే
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ స్టార్‌డమ్‌ ఇంటర్‌నేషనల్‌ రేంజ్‌ని టచ్‌ చేసింది. అయితే తనలో ఏ మార్పూ రాలేదంటున్నారు ప్రభాస్‌. ‘‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయింది. ప్రేక్షకులు మంచి విజయం అందించారు. కానీ నాలో ఏ మార్పూ లేదు. ఎప్పటి ప్రభాస్‌లానే ఉన్నాను’’ అని ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘బాహుబలి: 2’ ఏప్రిల్‌ 28న విడుదలైంది. ‘‘ఈ రోజు ఎమోషనల్‌గా నాకెప్పుడూ స్పెషలే. దర్శకుడు రాజమౌళి అండ్‌ టీమ్‌కి థ్యాంక్స్‌. అలాగే ఈ సినిమాకు ఇంతమంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు, నా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement