Shradda Rehabilitation Foundation
-
ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్‌తో.. నాలుగేళ్లకి ఇంటికి చేరిన మహిళ!
మహబూబ్‌నగర్: మతిస్థిమితం లేకుండా తిరుగుకుంటూ వెళ్లిన ఓ మహిళా నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరుకుంది. ఈ ఘటన మండలంలోని కానాయపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకుంట సరళమ్మ, కర్రెన్నల కుమార్తె వివాహిత గిరమ్మ మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతుండేది. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండేళ్లు వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు గిరమ్మను చేరదీశారు. మతిస్థిమితం నుంచి కోలుకునేవిధంగా చికిత్స అందించి గిరమ్మ నుంచి చిరునామా కనుకున్నారు. ఆదివారం శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చిన గిరమ్మను చూసిన కుటుంబ సభ్యులు ఆనందంలో ముగిగిపోయారు. ఫౌండేషన్ సభ్యుడు ప్రదీప్‌కుమార్‌కు గిరమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎనిమిది కిలోలు తగ్గాను
‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్ ఆహార్యం గొప్పగా ఉంటుంది. ఆ సినిమాలో రాజు పాత్ర కాబట్టి రాజసం ఉట్టిపడేలా తన ఫిజిక్‌ని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాకోసం ఆయన ఎనిమిది కిలోలు తగ్గారు. ‘‘బాహుబలి’ సినిమా కోసం చాలా బరువు పెరిగాను. కానీ ‘సాహో’ చిత్రానికి బరువు తగ్గాల్సి వచ్చింది. సరైన కార్బోహైడ్రేట్స్ డైట్‌తో దాదాపు ఎనిమిది కిలోలు తగ్గాను. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సీన్లు పర్ఫెక్ట్గా రావడం కోసం హాలీవుడ్ స్టంట్ నిపుణుల సహాయం తీసుకున్నాం. యాక్షన్‌తోపాటు సినిమాలో అద్భుతమైన లవ్‌స్టోరీ కూడా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అవుతారని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రభాస్. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ‘సాహో’ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న ‘సాహో’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘జాన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా చేస్తున్నారు. ఎప్పటి ప్రభాస్‌నే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ స్టార్డమ్ ఇంటర్నేషనల్ రేంజ్‌ని టచ్ చేసింది. అయితే తనలో ఏ మార్పూ రాలేదంటున్నారు ప్రభాస్. ‘‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయింది. ప్రేక్షకులు మంచి విజయం అందించారు. కానీ నాలో ఏ మార్పూ లేదు. ఎప్పటి ప్రభాస్‌లానే ఉన్నాను’’ అని ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘బాహుబలి: 2’ ఏప్రిల్ 28న విడుదలైంది. ‘‘ఈ రోజు ఎమోషనల్‌గా నాకెప్పుడూ స్పెషలే. దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్‌కి థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకు ఇంతమంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు, నా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’’ అని చెప్పారు. -
ఆ తప్పు చేయను
‘‘ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి ఓ పాఠం నేర్చుకోకపోవడం తప్పు. నేను ఆ తప్పు చేయను’’ అంటున్నారు కథానాయిక శ్రద్ధా కపూర్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో గెలుపు ఓటములు సహజం. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. వాస్తవానికి నా తొలి రెండు సినిమాలు ఆడలేదు. అయినా నేను నిరుత్సాహపడలేదు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నా. సినిమా రిజల్ట్‌ని ఆడియన్స్ ఎలాగూ డిసైడ్ చేస్తారు. సో.. ఆ సినిమాకు నేనెంత కష్టపడ్డానని మాత్రమే ఆలోచించుకుంటా. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సవాళ్లకు ఎప్పుడూ సిద్ధమే’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ సినిమాతో కథానాయికగా శ్రద్ధాకపూర్ సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రద్ధా కపూర్. ఇక బీటౌన్‌లో ఆమె నటించిన ‘స్త్ర్రీ’ ఈ నెల 31న, ‘బట్టీగుల్ మీటర్ చాలు’ సెప్టెంబర్ 21న విడుదల కానున్నాయి. అటు హిందీ ఇటు తెలుగు సినిమాలతో ఈ బ్యూటీ బిజీ. -
ఆన్ సైలెంట్ మోడ్
‘సైలెంట్ మోడ్’ అంటే ఫోన్ పరిభాషలో ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నామని, అందుకే సైలెంట్ మోడ్‌లో పెట్టాం అని అర్థం. ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకే వెళ్లారు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ యూనిట్. విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ‘ఆన్ సైలెంట్ మోడ్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందట హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన పనులన్నీ చాలా సైలెంట్‌గా చేస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్. స్క్రిప్ట్ వర్క్ విషయంలో కూడా చాలా సైలెంట్‌గానే ఉన్నారు త్రివిక్రమ్. ఇంత సైలెంట్‌గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారంటే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయటానికే అనుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే, శ్రద్ధాకపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. హారికా హాసినీ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతాన్ని తమన్, కెమెరాను పీఎస్ వినోద్ హ్యాండిల్ చేయనున్నారని సమాచారం. -
బాలీవుడ్లో ప్రేమ్ కీ కహానీ!
బాలీవుడ్లో ప్రజెంట్ టాప్ హీరోలు ఎవరు?... అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్... ఇలా రేస్‌లో చాలామంది ఉన్నారు. కానీ బాలీవుడ్లో 500 కోట్ల క్లబ్లో చేరిన సినిమాల లిస్ట్ గురించి మాట్లాడితే.. అందులో ‘బాహుబలి’ మొదటి వరసలో ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘బాహుబలి’ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ టాప్ యాక్టర్స్ లిస్ట్‌లో చేరేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు. అదేనండీ.. ప్రభాస్ బీటౌన్‌లో హీరోగా చేయబోతున్నారు అని చెబుతున్నాం. ‘‘నేను హిందీ సినిమాలు చూస్తాను. హైదరాబాద్‌లో 60 పర్సెంట్ పీపుల్ హిందీలో మాట్లాడగలరు. బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. హిందీ సినిమాలో నటించడానికి మూడేళ్ల క్రితం ప్రేమ కథ విన్నాను. నచ్చింది. ‘సాహో’ తర్వాత నటించాలనుకుంటున్నాను. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ‘బాహుబలి’ టీమ్‌కి హెల్ప్ చేశారు. ఆయన ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ యాక్టర్స్‌ను కలిశాను’’ అని పేర్కొన్నారు ప్రభాస్. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా శక్తిమంతమైన పాత్రల్లో కనిపించిన ప్రభాస్ నెక్స్›్ట హిందీలో ప్రేమ్ కీ కహానీలో కనిపించడం కొత్తగా ఉంటుందనే చెప్పాలి. ప్రజెంట్ ‘రన్ రజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. ప్రస్తుతం న్యూ ఇయర్ హాలిడేస్‌లో ఉన్న ప్రభాస్ త్వరలో ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. -
18 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
వెల్దండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి 18 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతకని చోటంటూ లేదు. చివరకు మరణించాడనుకొని ఆశలు వదులుకున్నారు. అయితే మంగళవారం అతను ప్రత్యక్షమవడంతో ఇది కలనా.. నిజమా అని కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యంలో మునిగితేలారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండకు చెందిన కనుగుల కృష్ణయ్య అలియాస్ గున్నకు మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో 18 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దులో అక్కడి స్వచ్ఛంద సంస్థ అయిన శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌కు దొరికాడు. నిర్వాహకులు ముంబైలోని గుంజ్ మానసిక వైద్య కేంద్రంలో చికిత్సలు చేయించడంతో సాధారణ వ్యక్తిగా మారాడు. అనంతరం తన చిరునామా చెప్పడంతో సంస్థ సభ్యులు వసంత్, సిద్దు మంగళవారం స్వగ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా తమ సంస్థను 1986లో ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు సుమారు నాలుగు వేల మంది బాధితులను బాగుపరిచి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వసంత్, సిద్దు వివరించారు.