ఆన్‌ సైలెంట్‌ మోడ్‌ | NTR And Trivikram Movie Title as On Silent Mode | Sakshi
Sakshi News home page

ఆన్‌ సైలెంట్‌ మోడ్‌

Published Sat, Feb 24 2018 12:20 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

NTR And Trivikram Movie Title as On Silent Mode  - Sakshi

ఎన్టీఆర్‌

‘సైలెంట్‌ మోడ్‌’ అంటే ఫోన్‌ పరిభాషలో ఏదో ఇంపార్టెంట్‌ పనిలో ఉన్నామని, అందుకే సైలెంట్‌ మోడ్‌లో పెట్టాం అని అర్థం. ప్రస్తుతం సైలెంట్‌ మోడ్‌లోకే వెళ్లారు ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ మూవీ యూనిట్‌. విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ‘ఆన్‌ సైలెంట్‌ మోడ్‌’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించిందట హారికా హాసినీ క్రియేషన్స్‌ సంస్థ. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన పనులన్నీ చాలా సైలెంట్‌గా చేస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్‌.

స్క్రిప్ట్‌ వర్క్‌ విషయంలో  కూడా చాలా సైలెంట్‌గానే ఉన్నారు త్రివిక్రమ్‌.  ఇంత సైలెంట్‌గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారంటే కచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద ఏదో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయటానికే అనుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, శ్రద్ధాకపూర్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మార్చి నుంచి సెట్స్‌ పైకి వెళ్లనుంది. హారికా హాసినీ బ్యానర్‌ పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతాన్ని తమన్, కెమెరాను పీఎస్‌ వినోద్‌ హ్యాండిల్‌ చేయనున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement