
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రోజుకో వార్తను వదులుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
తాజాగా సాహోకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలకమైన ఓ చేజ్ సీన్‌ను అబుదాబిలో భారీ ఎత్తున చిత్రీకరించారు. దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న ఈ సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. బాలీవుడ్ నటులు ఇవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment