
చెన్నై : సాహో ఫీవర్ పీక్స్‌కు చేరడంతో రికార్డులు సైతం సాహోకు దాసోహం అంటున్నాయి. ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాహో అత్యధిక స్ర్కీన్లలో విడుదలవుతూ బాహుబలి రికార్డులను అధిగమిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సాహో తమిళ్ వెర్షన్‌కు అత్యధిక స్క్రీన్‌లు దక్కాయి. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 తమిళనాడులో 525 థియేటర్లలో రిలీజ్ కాగా సాహో ఏకంగా 550 స్క్రీన్‌లలో సందడి చేయనుంది. సాహోకు పెద్దసంఖ్యలో థియేటర్లు అందుబాటులోకి రావడంతో బాహుబలి 2 వసూళ్ల రికార్డును అధిగమించే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. సాహోతో తమిళ ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి దక్కుతుందని దర్శకుడు సుజీత్ చెప్పారు. బాహుబలి సిరీస్ విడుదల అనంతరం పలు భాషా పరిశ‍్రమల మధ్య హద్దులు చెరిగిపోవడం విశేషం. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్ వంటి పలు తెలుగు సినిమాలు తమిళ తెరపైనా వినోదం పంచాయి. సాహో తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా సైతం తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో భారీ స్ధాయిలో విడుదలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment