
సాహోలో తన నటనతో ఆకట్టుకున్న జర్మన్ బ్యూటీ ఎవెలిన్ శర్మ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషన్ బైనాండితో తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ఎవెలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సిడ్నీలోని ప్రముఖ హార్బర్ బ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌లో తుషన్‌తో రోమాంటిక్‌గా దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. కాగా ఎవెలిన్ గత కొంతకాలంగా తుషన్‌తో డేటింగ్‌లో ఉన్నారు. ఎవెలిన్ తన ఎంగేజ్‌మెంట్ అయిందని ప్రకటించగానే అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో తనను విష్ చేసిన వారందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
జర్మనీలో పుట్టి, పెరిగిన ఎవెలిన్ ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘సాహో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఎవెలిన్.. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment