విక్కీ, శ్రద్ధా కపూర్, ప్రభాస్, ప్రమోద్
‘‘గల్లీ క్రికెట్‌లో సిక్సర్ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో సిక్స్ కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది’’ అనే డైలాగ్‌తో ‘సాహో’ ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘ స్క్రీన్‌ప్లే ప్రధానమైన స్క్రిప్ట్ ఇది. నిఖిల్, సుజీత్ ఇద్దరూ ట్రైలర్ కట్ చేశారు. 137 వెర్షన్స్ కట్స్ చేశారు. సినిమా చూశాక ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో అనిపిస్తుంది. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు.
ప్రమోద్, నేను కలసి పెరిగాం. మేం ఫ్రెండ్స్ కాదు.. ఫ్యామిలీ. అందుకే ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ‘సాహో’ లో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నా రెండో ఇల్లు. రెండేళ్లుగా ‘సాహో’ షూటింగ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాతో తెలుగులో పరిచయం కావడం చాలా బావుంది’’ అన్నారు శ్రద్ధా కపూర్. ‘‘సాహో’ ఫస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత ప్యా¯Œ ఇండియా సినిమా. ఇక నుంచి నాన్‌స్టాప్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు ప్రమోద్. ‘‘సాహో’ను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. కొన్ని థియేటర్స్‌లో ‘సాహో’ కోసమని స్క్రీన్‌లు, సౌండ్ సిస్టమ్‌లు అప్‌డేట్ చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్‌లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు విక్కీ.
ఈ సందర్భంగా విలేకరులతో ప్రభాస్, శ్రద్ధా మాటామంతీ...
► ప్రభాస్‌తో రొమాన్స్, యాక్షన్ రెండూ చేశారు. దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు?
శ్రద్ధా కపూర్ : రెండూ (నవ్వుతూ)
► శ్రద్ధా సెట్స్‌లో తెలుగులో ఎలా మాట్లాడారు.
ప్రభాస్: షూటింగ్ ఫస్ట్‌డే నుంచి తెలుగు డైలాగ్స్ బాగా చెప్పింది. మేం షాక్ అయ్యాం. చాలా కష్టపడి నేర్చుకున్నారు. శ్రద్ధా మంచి లవ్‌స్టోరీలు చేసింది. యాక్షన్ మూవీలో ఎలా ఉంటుందో అనుకున్నాం. మమ్మల్ని సర్‌ప్రైజ్ చేసింది.
► సుజీత్ మీద ‘బాహుబలి’ సినిమా తాలుకా ఒత్తిడి ఏమైనా ఉందా?
ప్రభాస్ : సుజీత్ మీదే కాదు.. మా అందరి మీద కూడా ఒత్తిడి ఉంది. అందుకే టైమ్ తీసుకుని క్వాలిటీగా చేశాం. అతని వయసు తక్కువ. సినిమాలో పెద్ద టెక్నీషియన్స్‌ని బాగా డీల్ చేశాడు. సెట్లో తను కోప్పడటం, అరవడం కనబడలేదు.
► ఒక సినిమా అనుభమున్న సుజీత్‌ని ఎలా నమ్మారు? సినిమా అనుకున్నట్టే తీస్తున్నాడు అని ఏ పాయింట్‌లో అనిపించింది.
ప్రభాస్ : ఫస్ట్ డే షూట్ చాలా క్లిష్టమైన సన్నివేశం. ఒక్క సీన్ 5–6 వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలో నాలుగైదు సార్లు వస్తుంది. సినిమాను దాంతోనే స్టార్ట్ చేశాం. రీషూట్ చేయలేదు, కరెక్షన్ లేదు. స్టోరీలో 8 లేయర్స్ ఉంటాయి. అంత ఈజీగా డీల్ చేసినప్పుడే తను చేయగలడనిపించింది.
► ‘సాహో’తో బాలీవుడ్ బాద్‌షా అవుతారని అనుకుంటున్నారా?
ప్రభాస్: ‘బాహుబలి’ ఆడియన్స్‌ను, ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలి. దానికోసం పగలు, రాత్రి కష్టపడ్డాం. వాళ్లు సంతృప్తి చెందితే చాలు. సినిమా బాగా ఆడాలనుకుంటున్నాను.
► ట్రైలర్‌లో సిక్సర్ డైలాగ్ ఉంది. మీరు సిక్సర్ కొడతారా?
ప్రభాస్ : నేను క్రికెట్ ఆడటానికి వెళ్లినప్పుడు లాగి కొట్టడమే. తగిలితే సిక్సరే. డిఫెన్స్ ఆడటం ఇష్టముండదు.
► యాక్షన్స్ సీన్స్ చాలెంజింగ్‌గా అనిపించాయా?
ప్రభాస్ : చాలా మంది ఫైట్ మాస్టర్స్ ఉన్నారు. చాలా యాక్షన్ సన్నివేశాలున్నాయి. కొన్నిటి కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నాం. స్టోరీ బోర్డ్‌లు వేశాం. ప్రీ– ప్రొడక్షన్ ఎక్కువ ఉంది.
శ్రద్ధా : మొదట్లో గన్ పట్టుకున్నప్పుడు చేతులు వణికేవి. నేను పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తూ అలా వణకకూడదు. తర్వాత గన్ పట్టుకోవడం అలవాటు అయింది.
► ‘సాహో’తో ఖాన్స్‌కి షాక్ ఇవ్వబోతున్నారా?
ఖాన్స్ (సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్) ఇండియాను ఇన్‌స్పైర్ చేశారు. వాళ్లకు పోటీ అని అనకూడదు. బాలీవుడ్ వాళ్లు నన్ను బాగా ఆదరించారు. పెద్ద పెద్ద స్టార్స్ నాకు మెసేజ్‌లు పంపారు.
‘సాహో’ ట్రైలర్ చూసి రాజమౌళిగారు బావుందని చెప్పారు. షాక్ ఏంటంటే చిరంజీవిగారు ఫోన్ చేశారు. బావుందని అభినందించారు. మెసేజ్ కూడా చేశారు. ఫుల్ హ్యాపీ అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment