
సాక్షి, సినిమా : ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం సాహో. శనివారం ట్రైలర్ రిలీజైంది. అనంతరం తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు యంగ్ రెబల్ స్టార్. ఆయన మాటల్లోనే.. ‘సాహో కోసం రెండు సంవత్సరాల సమయం కేటాయించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు బాహుబలికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. కానీ అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల వంటి వాటికే ఏడాది సమయం పట్టింది. అందువల్ల సినిమా పూర్తవ్వడానికి రెండేళ్లు కేటాయించాల్సి వచ్చింద’న్నారు. మరోవైపు తొలిసారి హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పానని, కొంచెం కష్టమైనా కొత్తగా ఫీలయ్యానని తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి చెప్తూ కె.కె. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఇప్పటికే 20 రోజులు షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment