బాహుబలి తరువాత అదే స్థాయి హైప్ తీసుకువచ్చిన సినిమా సాహో. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, లొకేషన్లు ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయం అని చిత్రయూనిట్ నమ్మకంగా చెప్పింది. మరి ప్రభాస్.. బాహుబలి తరువాత మరోసారి సాహో అనిపించాడా..? ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్ ఇంతటి భారీ చిత్రాన్ని ఎలా డీల్ చేశాడు..? మరోసారి సౌత్ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటిందా.?