
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ సాహో. ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో చిత్రబృందం గురువారం విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్ సంచలనాలు నమోదుచేస్తోంది. విడుదలైన 6 గంటల్లోనే 25 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే గత రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీజర్ విడులైన 25 నిమిషాల్లోనే లక్ష లైక్స్ సాధించిన తెలుగు టీజర్‌గా సాహో చరిత్ర సృష్టించింది. యూట్యూబ్‌లో మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. #saaho హాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది..
టీజర్‌లోని విజువల్స్ గ్రాండియర్ సినీ అభిమానులను అలరిస్తున్నాయి. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌లో కనువిందు చేశాయి. టాలీవుడ్ సినిమా ప్రముఖులు కూడా సాహో టీజర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతున్న సాహో టీమ్‌ను అభినందిస్తున్నారు.
(చదవండి : సాహో టీజర్ రివ్యూ.. వావ్ అనిపించిన ప్రభాస్)
Comments
Please login to add a commentAdd a comment