
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. అంతర్జాతీయ స్థాయి పోరాట సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సాహో ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌లతో పాటు పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. భారీ అంచనాలున్న సాహో ట్రైలర్‌ను ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్ ఆన్‌లైన్ వ్యూస్‌లో రికార్డ్ సృష్టించగా ట్రైలర్ మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, మలయాళ నటుడు లాల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The wait is over! The biggest and most anticipated trailer of the year will be out on 10th August! 😎 #SaahoTrailer#Saaho releases worldwide on 30th August! #30AugWithSaaho pic.twitter.com/2ECUmJMvOu
— UV Creations (@UV_Creations) August 8, 2019
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment