
‘సాహో’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మేకర్స్.. ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తడంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారింది. ప్రభాస్‌ను వెండితెర మీద చూసేందుకు అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో నిన్నటి ఈవెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. బాహుబలి తరువాత రెండేళ్ల గ్యాప్‌తో వస్తోన్న ఈ మూవీపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అభిమానుల అంచనాలకు తగ్గట్లే సాహోను తెరకెక్కించినట్లు దర్శకుడు, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. సాహో పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఏ రేంజ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సాహో ట్రైలర్ అయితే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా బ్యాడ్ బ్యాయ్ అంటూ ఓ ప్రత్యేక గీతాన్ని వదిలారు. ఈ పాటలో మన డార్లింగ్.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుజీత్ తెరకెక్కించిన సాహో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment