బీజింగ్: చైనా మాజీ ప్రధాని (Premier) లీ కెకియాంగ్ (68) కన్నుమూశారు. షాంఘైలో గురువారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. సంస్కరణల మేధావిగా పేరున్న కెకియాంగ్‌ను అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొక్కేశారనే రాజకీయ విమర్శ ఒకటి ఉంది.
అన్హూయి ప్రావిన్స్‌కు చెందిన ఓ రాజకీయ నేత కొడుకు లీ కెకియాంగ్. రాజకీయాల్లో నేతలకు స్వేచ్ఛా నిర్ణయాలు ఉండాలనే కెకియాంగ్.. దశాబ్దకాలంగా మాత్రం జిన్‌పింగ్ సారథ్యంలోని పార్టీ గీత మీదే నడిచారు. మాజీ బ్యూరోక్రాట్ అయిన ఈయన ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ఆర్థిక సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిచ్చే విధానాలను ఆయన రూపొందించారు. అయితే హెనాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తూండగా అడ్డగోలుగా రక్తదాన శిబిరాల నిర్వహణ, ఫలితంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసులు రికార్డు కావడంతో ఆయన ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది.
తరువాతి కాలంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా లీ కెకియాంగ్‌ను ఓ కీలుబొమ్మ ప్రధానిగా మార్చేశారని చైనా మేధావులు తరచూ విమర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడైన కెకియాంగ్ సేవల్ని కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు జిన్‌పింగ్ వినియోగించుకోలేదని అభిప్రాయపడుతుంటారు.
State Media is reporting that Li Keqiang has died of a heart attack. No word on a funeral, but mourning dead leaders, especially ones recently forced out of office, is always a tricky proposition for the Party. pic.twitter.com/NHHX8waDmi
— Jeremiah Jenne (@JeremiahJenne) October 27, 2023
Comments
Please login to add a commentAdd a comment