Goldmine
-
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్‌గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
2024 ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో పసిడి ఉత్పత్తి
న్యూఢిల్లీ: జొన్నగిరి బంగారు గనుల్లో వచ్చే ఏడాది అక్టోబర్–డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని డెక్కన్ గోల్డ్ మైన్స్ (డీజీఎంఎల్) ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 750 కిలోల బంగారం వెలికి తీయొచ్చని ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు దీనిపై రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయగా పైలట్ ప్రాతిపదికన ప్రస్తుతం నెలకు ఒక కేజీ మేర బంగారాన్ని మైనింగ్ చేస్తున్నారు. 2013లో తమకు గనిని కేటాయించగా, ప్రాజెక్టు మదింపును పూర్తి చేసేందుకు 8–10 ఏళ్లు పట్టినట్లు ప్రసాద్ చెప్పారు. అటు కిర్గిజ్స్తాన్లో తమకు 60 శాతం వాటాలున్న మరో బంగారు గనిలో కూడా 2024 అక్టోబర్–నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు నుంచి ఏటా 400 కేజీల బంగారం వెలికితీయొచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గని ఉంది. బీఎస్ఈలో లిస్టయిన ఏకైక గోల్డ్ మైనింగ్ కంపెనీ డీజీఎంఎల్. జొన్నగిరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసూర్ సరీ్వసెస్ ఇండియాలో డీజీఎంఎల్కు మెజారిటీ (40 శాతం) వాటాలు ఉన్నాయి. -
సీఎం జగన్ నిర్ణయంతో చిగురుకుంట బంగారు గనులకు మహర్దశ
సీఎం జగన్ మాట బంగారు బాట కానుంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో దాగిన బంగారు ఖనిజాన్ని వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో చిగురుకుంట బంగారు గనులకు మోక్షం లభించనుంది. 1,500 మంది కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పంచాయతీలకు రాబడి పెరగనుంది. 20 ఏళ్ల పాటు సొంత నియోజకవర్గంలోని బంగారు గనులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బంగారాన్ని వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్ఎండీసీ సంస్థ రూ.450 కోట్లతో టెండర్ దక్కించుకుంది. కుప్పం రూరల్/ గుడుపల్లె: దేశంలోనే పేరుగాంచిన చిగురుకుంట బంగారు గనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మహర్దశ రానుంది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బంగారు గనులు మూతపడడంతో వెయ్యి మంది కార్మిక కుటుంబాలు వీధిన పడినా అప్పటి సీఎం చంద్రబాబు స్పందించలేదు. ఫలితంగా కార్మికుల గోడు అరణ్యరోదనగా మారింది. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గమైనా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనులను తెరిపించే దిశగా అడుగులు వేశారు. ఈ నెల 4న కుప్పం ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏడాదిలోపు చిగురుకుంట బంగారు గనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఈ ప్రాంతానికి మహర్దశ రానుంది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బంగారు గనుల ప్రస్థానం గుడుపల్లె మండలం బిసానత్తం గనిని 1968లో, దశాబ్దం తరువాత చిగురుకుంట గనిని 1978లో ఎంఈసీఎల్ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ పదేళ్లపాటు క్వార్జ్ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్)లోని బీజీఎంఎల్ (భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్)కు అందజేస్తూ వచ్చింది. కాలక్రమేణా ఎంఈసీఎల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్ 1982లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీసే పనిని చేపట్టింది. దీంతో గనులు లాభాల బాట పట్టాయి. కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్ నిర్వహిస్తున్న చాంపియన్ గని నష్టాల్లో పడింది. కొంత మంది స్వార్థపరులు చిగురుకుంట, బిసానత్తం గనులు నష్టాల్లో సాగుతు న్నట్లు తప్పుడు లెక్కలు చూపించడంతో లాక్అవుట్ అయ్యాయి. ఇంత పెద్ద నష్టం తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుముడుచుకుని కూర్చున్నారు. దీంతో గనులు మూతపడ్డాయి. మరో ఏడాదిలో ప్రారంభం మూతపడ్డ గనులను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల తరువాత ఇక్కడ బంగారు కోసం అన్వేషించాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. జియో సంస్థ మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కి.మీ. మేర పరిశోధనలు చేసి 263 హెక్టార్లను ఎంపిక చేసింది. 150 బోర్లు డ్రిల్ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేపట్టింది. ఇక్కడ దొరికిన సల్ఫేట్ మట్టిని బెంగళూరుకు తరలించి ల్యాబ్‌లో పరీక్షించారు. పరీక్షల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. నివేధికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బిడ్లను పిలిచింది. ఈ బిడ్లకు ఆదాని, వేదాంత వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరో సంవత్సరంలో గనులు ప్రారంభిస్తామని చెప్పడం శుభపరిణామం. స్థానికులకు ఉపాధి గనులు ప్రారంభిస్తే స్థానికులకు ఉపాధితో పాటు పంచాయతీలకు ఆదాయం రానుంది. గనులు లాక్ అవుట్ చేసే నాటికి 1500 మంది పని చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో గనులు సాగాలంటే 3 వేల మంది సిబ్బంది అవసరమవుతుంది. వీరిలో 1500 గని కార్మికులు మరో 1500 నిపుణులు, ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఓఎన్ కొత్తూరు పంచాయతీకి నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేదని కార్మికులు తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆదాయం నాలుగింతలు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. పారదర్శకతతో నిధులు వినియోగిస్తే రెండు పంచాయతీల అభివృద్ధితో పాటు కుప్పం నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లే. వినియోగంలోకి కోట్లాది రూపాయల సామగ్రి గనుల్లో మూలన పడిన కోట్లాది రూపాయల సామగ్రి వినియోగంలోకి రానుంది. అక్కడ ఉన్న జనరేటర్లు, లిఫ్టులు, ట్యాంకర్లు, మోటార్లు తుప్పుపట్టిపోయాయి. గనులు ప్రారంభిస్తే పరికరాలు వినియోగంలోకి వచ్చి కోట్ల రూపాయలు ఆదా కానుంది. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉండగా, ఇందులో రెండు మార్గాలు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి, మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటికి తీయడానికి వినియోగించనున్నారు. సొరంగాలకు వినియోగించే భారీ టవర్లు వినియోగంలోకి రానున్నాయి. 8.5 టన్నుల బంగారం ఉత్పత్తే లక్ష్యం 263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండవచ్చని ఎన్ఎండీసీ అధికారుల అంచనా. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. మొత్తం 8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఖర్చు పెట్టనుంది. గనుల ప్రదేశంలోనే బంగారుశుద్ధి ప్లాంటుకు ఎన్ఎండీసీ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. (క్లిక్: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్) యువతకు ఉపాధి ఇప్పటికే కుప్పం నియోజక వర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి దయతో గనులు ప్రారంభమైతే మాలాంటి వారికి స్థానికంగానే ఉపాధి లభించనుంది. అంతే కాకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందనుంది. కుప్పంకు రాష్ట్రంలో గుర్తింపు వస్తుంది. చంద్రబాబు చేయలేని పని జగగన్న చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – సంపంగి, సంగనపల్లి పంచాయతీలకు ఆదాయం గనులు ప్రారంభమైతే చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా సంగనపల్లి, ఓఎన్ కొత్తూరు పంచాయతీలకు సెస్సుల రూపంలో రాబడి పెరిగే అవకాశం ఉంది. సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ గనులకు మోక్షం లభించడం ఆనందకరమే. ఇప్పటికైనా మా ప్రాంత గనులను గుర్తించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – అమర్నాథ్, సర్పంచ్, సంగనపల్లి -
మనదేశంలో బంగారు గనులు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
గనుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటా ప్రకారం, భారత్‌లో నిర్ధారించిన ప్రస్తుత బంగారం మైనింగ్ నిల్వల పరిమాణం 70.1 టన్నులు. ఇందులో 88 శాతం కర్ణాటకలో ఉంది. మరో 12 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. చాలా తక్కువ మొత్తం (0.1టన్ను కంటే తక్కువ) జార్ఖండ్‌లో కనుగొనడం జరిగింది. 1947లో పునఃప్రారంభించబడినప్పటి నుండి 2020 వరకు, కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్ మైన్ దాదాపు 84 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మైన్ ప్రస్తుతం భారతదేశంలోని ఏకైక ముఖ్యమైన బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. భారత్ తన మొత్తం పసిడి డిమాండ్‌లో 80 శాతంపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ)ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ 2021లో 1,067 టన్నుల దిగుమతులు చేసుకుంది. కోవిడ్–19 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న 2020లో ఈ పరిమాణం కేవలం 430.11 టన్నులు. 2019తో పోల్చిచూస్తే, 28 శాతం పెరిగి 836.38 టన్నులుగా నమోదయ్యింది. ఎగుమతుల విషయానికొస్తే, 2021లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో దేశం నుండి ఈ విభాగంలో రవాణా 50 శాతం పెరిగి 8,807.50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. చదవండి: భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ! -
గోల్డ్మైన్లో చిక్కుకున్న 995 మంది కార్మికులు
-
‘కోకాపేట’ కథ క్లైమాక్స్‌కు..!
- ‘గోల్డ్‌మైన్’భూముల టైటిల్ వివాదంపై నేడు సుప్రీంలో విచారణ - ఎకరం రూ.14.4 కోట్లకు విక్రయంతో దేశవ్యాప్త ప్రచారం - హోటల్ కట్టలేం..డబ్బులివ్వమంటున్న ‘టుడే హోటల్స్’ - ఈ భూములు సర్కార్వే.. డబ్బు ఇవ్వలేమంటున్న హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: ఎకరం భూమి 14.4 కోట్లు పలికిన కోకాపేట ‘గోల్డ్‌మైన్’ భూముల కథ క్లైమాక్స్‌కు చేరుతోంది. తాము వేలంలో కొనుగోలు చేసిన భూమి తమకు వద్దంటూ, తాము చెల్లించిన రూ. 62.22 కోట్లు వెనక్కి ఇప్పించమంటూ టుడే హోటల్స్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు బలమైన వాదన వినిపించే దిశగా ఢిల్లీలో మకాం వేశారు. కోర్టు నిర్ణయం హెచ్ఎండీఏకు అనుకూలంగా వస్తే కోకాపేటలో మళ్లీ సందడి నెలకొనే ఛాన్స్ ఉండగా, వ్యతిరేకంగా వస్తే మాత్రం పద్నాలుగు సంస్థలు చెల్లించిన అసలుకు తోడు వడ్డీ కలుపుకుని సుమారు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే హెచ్ఎండీఏ ఆర్థి వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. రిలయ్ బూంలో ‘ గోల్డ్‌మైన్’ దేశంలోనే విస్తృత ప్రచారం పొందిన కోకాపేట భూములను పదేళ్ల క్రితం హెచ్ఎండీఏ ‘గోల్డ్‌మైన్’ పేరుతో వేలం వేసింది. ఇందులో అంతర్జాతీయఖ్యాతి పొందిన అనేక సంస్థలు పాల్గొని భూములు దక్కించుకున్నాయి. ఇందులో గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్-1,2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్ బూమ్ కారణంగా ఎకరం ధర రూ.5-14.25 కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా మొత్తం రూ.1755 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్కతేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. ఇందులో టుడే హోటల్స్ అనే సంస్థ ఎకరం భూమిని రూ. 13.51 కోట్ల చొప్పున మొత్తం 4.6 ఎకరాలను కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని ఒకే వాయిదాలో చెల్లించింది. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, వివాదాన్ని తమకు చెప్పుకుండా హెచ్ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి . ఇదీ వివాదం.. కోకాపేట భూములకు హక్కుదారు నేనేనంటూ 2006 ఏప్రిల్‌లోనే కె.ఎస్.ఎ.అలీ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత 2006 జూన్‌లో ఈ భూమిని అప్పటి ‘హుడా’ ప్రస్తుత హెచ్ఎండీఏకు ప్రభుత్వం అప్పగించింది. జులై 14న ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి వేలం నిర్వహించారు. దీనిపై వాదోపవాదనల అనంతరం కోకాపేటలోని సుమారు 1650 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పు వెలువరించింది. సంబంధిత సంస్థలకు భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుండగానే దీనిపై అలీ సుప్రీంను ఆశ్రయించి ‘స్టే’ పొందారు. దీంతో హెచ్ఎండీఏ వేలంలో స్థలాలు కొనుగోలు చేసిన సంస్థలకు గడువులోగా భూముల బదలాయింపు నిలిచిపోయింది. కోకాపేట వాసుల్లో ఉత్కంఠ కోకాపేట భూముల వివాదం సోమవారం సుప్రీం కోర్టు ముందుకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో కోకాపేట వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. 2006 నుండి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక భూమి ధర పలికింది కోకాపేట్‌లోనే కావటం విశేషం. అప్పటి ప్రభుత్వం తలపెట్టిన విధంగా అన్నీ సవ్యంగా జరిగితే ఈ రోజు కోకాపేట పరిసరాల స్వరూపమే పూర్తిగా మారిపోయి ఉండేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పద్నాలుగు కోట్లకు పలికిన భూములు ఇటీవల కాలంలో ఎకరానికి నాలుగు నుండి ఐదు కోట్లకు పడిపోవటంతో ఎన్నడో వ్యవసాయాన్ని వదిలేసిన వారు మళ్లీ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు.