Vijay Devarakonda and Mrunal Thakur New Movie Launched Today - Sakshi
Sakshi News home page

VD13: విజయ్ దేవరకొండ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్

Published Wed, Jun 14 2023 3:04 PM | Last Updated on Wed, Jun 14 2023 4:53 PM

Vijay Devarakonda-Mrunal Thakur New Movie Launch - Sakshi

విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆల్రెడీ 'ఖుషి'తో బిజీగా ఉన్న ఇతడు.. గౌతమ్ తిన్ననూరి మూవీలోనూ హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు 'గీతగోవిందం'తో తనకు హిట్ ఇచ్చిన పరశురామ్ తో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్ లో బుధవారం(జూన్ 14) ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ని గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. 'గీతగోవిందం' కాంబో రిపీటైంది కానీ ఇందులో హీరోయిన్, ప్రొడ్యూసర్ మారారు. 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తారు. 

(ఇదీ చదవండి: వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్‌ విజయ్‌ దేవరకొండ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement