సాక్షి, అమరావతి: సామాజిక, ఆర్థిక, మానవాభివృద్ధి రంగాల్లో పరిశోధనలు చేస్తున్న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో రాష్ట్రానికి 6 సీట్లు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం స్పాన్సర్ చేసే ఈ బీఏ కోర్సు సీట్లకు విధివిధానాలు ఖరారు చేసి ఈ ఏడాది నుంచే కేటాయించనున్నారు. ప్రస్తుతం 60 సీట్లతో నడుస్తున్న హైదరాబాద్ క్యాంపస్‌లో మరో 6 సూపర్ న్యూమెరరీ సీట్లను ఏపీకి కేటాయించనున్నారు. ఈమేరకు టిస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టిస్ డైరెక్టర్ ఎస్.పరశురామ్.. ఏపీ సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ పండా దాస్ గురువారం ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలుంటాయని టిస్ అధికారులు తెలిపారు.