ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మే 12 ఈ మూవీ థియేటర్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు, హీరోయిన్ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ పరశురామ్ మూవీ విశేషాలతో పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సర్కారు వారి పాట కథ రాసుకున్నాననని చెప్పారు.
చదవండి: ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ
‘మహేశ్ బాబు గారి కోసమే ఈ స్క్రిప్ట్ రాశాను. ఒకవేళ ఆయన ఈ కథను రిజెక్ట్ చేస్తే స్క్రిప్ట్ పక్కన పెట్టేయాలని అనుకున్నా. కానీ మహేశ్ బాబు గారికి కథ వివరిస్తున్నంతసేపు ఆయన ఎంజాయ్ చేశారు. అప్పుడే ఆయనకు కథ నచ్చిందని అర్థమైంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పూర్తి స్క్రిప్ట్ విన్నాక.. కథ చాలా బాగుందంటూ మహేశ్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారన్నారు. ఆ వెంటనే హీరోయిన్‌గా ఎవరిని అనుకుంటున్నారని మహేశ్ తనని అడిగారని, అప్పుడే కీర్తి సురేశ్ పేరు చెప్పానన్నారు.
చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
అందుకు ఆయన వెంటనే ఒకే అనేశారని చెప్పారు. అయితే కీర్తి సురేశ్‌ను చూసిన దగ్గర నుంచి ఆమెతో సినిమా చేయాలని అనుకున్నానని, అది సర్కారు వారి పాటతో కుదరిందన్నారు. అయితే ఈ సినిమాకు ఆమెను తీసుకోవడం వెనుక పాత్ర పరమైన కారణం ఉండి ఉంటుందనే ఉద్దేశంతో మహేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కథ ఒకసారి లాక్ చేసిన తరువాత మహేశ్ గారు ఏ విషయంలోను జోక్యం చేసుకోరని ఆయన వివరించారు. అలా కీర్తి సురేశ్ పేరును ఈ సినిమాకు తానే సిఫార్స్ చేశానని, మహేశ్ కాదని డైరెక్టర్ పరశురామ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment