
విజయోత్సవ సభలో డ్యాన్స్ వేస్తున్న మహేష్‌బాబు తదితరులు
కర్నూలు (కల్చరల్): అభిమానులు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను జీవితంలో మరిచిపోలేనని సినీ హీరో మహేష్‌బాబు ఉద్వేగంతో చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు తనకు దొరికారన్నారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో కర్నూలు వచ్చానని.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు.
కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. మొదటిసారి వేదికపై డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఫంక్షన్లంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలని మహేష్‌బాబు అన్నారు.
సినిమా డైరెక్టర్ పరుశురామ్ మాట్లాడుతూ.. కర్నూలులో విజయోత్సవ సభ జరుపుకోవడం లైఫ్ టైం గిఫ్ట్ అన్నారు. సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి, గోపి, రామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment