
ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం క్వారంటైన్ సమయాన్ని కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. మహేశ్ తర్వాతి చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే... ఈ సినిమా ప్రారంభోత్సవం మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న జరగనుందట. మహేశ్ నటించిన గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ప్రారంభోత్సవం కూడా కృష్ణ బర్త్ డే (2019 మే 31) సందర్భంగానే జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment