
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కావటంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్‌తో సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగినా అది సెట్ కాలేదు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించినా ఆ ప్రాజెక్ట్ కూడా కన్ఫమ్ కాలేదు. దీంతో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం బన్నీ నెక్ట్స్ సినిమా యంగ్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో అన్న టాక్ వినిపిస్తోంది. ఈ రోజు (మంగళవారం) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పరుశురాం.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే ఉంటుందని ఆ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారని హింట్ ఇచ్చారు. దీంతో పరుశురాం చెప్పిన ఆ స్టార్ హీరో అల్లు అర్జునే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment