బుక్కపట్నం: మండలంలోని పాముదుర్తి వెంకటాపురంలో ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన పరశురాం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాలు. పొలం పనులకు వెళ్లినప్పుడు పరుశురాం అక్కడికి వచ్చి తన భార్యపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.