హీరో కార్తీ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని టాలీవుడ్ టాక్. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఆసక్తిగా ఉన్నారు కార్తీ. ఇందుకోసం కథలు కూడా వింటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే పరశురామ్ చెప్పిన ఓ కథకు ఇంప్రెస్ అయ్యారట కార్తీ.
దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని, కథ పరంగా ఈ మూవీకి ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ‘గీతగోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండతో మరో సినిమాకు కమిటయ్యారు పరశురామ్. అయితే ఆయన ఏ హీరోతో ముందుగా సినిమా చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
చదవండి:
నటి హేమ కూతురిని చూశారా? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా?
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment